03-09-2019- మంగళవారం దినఫలాలు - కొన్ని కారణాల రీత్యా మీ...

మంగళవారం, 3 సెప్టెంబరు 2019 (09:26 IST)
మేషం: ఒక స్థిరాస్తి అమర్చుకునే విధంగా మీ ఆలోచన లుంటాయి. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తడి అధికం. ఏదైనా వ్యాపారం చేయాలనే మీ ఆలోచన కొంత కాలం వాయిదా వేయటం మంచిది. ధనం నిల్వ చేయాలనే మీ ఆలోచన ఫలిస్తుంది. వాతావరణంలో మార్పు వల్ల స్త్రీల ఆరోగ్యం మందగిస్తుంది.
 
వృషభం: బంధువులతో సంబంధాలు మెరుగుపడతాయి. వాహనం నడుపునపుడు ఏకాగ్రత అవసరం. ప్రముఖులతో పరిచయాలు విస్తరిస్తాయి. ఆస్తి వివాదాలు ఒక కొలిక్కివచ్చే ఆస్కారం ఉంది. పండ్ల, పూల, కూరగాయలు, చిరు వ్యాపారులకు కలిసిరాగలదు. విద్యార్థులు అనవసర విషయాలకు దూరంగా ఉండటం మంచిది. 
 
మిధునం: సాంఘీక, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు సదవకాశాలు లభించే ఆస్కారం ఉంది. కొబ్బరి, పండ్ల, పూల, పానీయ వ్యాపారులకు లాభదాయకం. క్రీడా, కళా, రంగాల్లో వారికి నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, చికాకులు. వృత్తుల్లో వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది.
 
కర్కాటకం: ఆర్థిక విషయాలు, పెట్టుబడుల గురించి స్పష్టమైన నిర్ణయానికి వస్తారు. మొండి బాకీలు వసూలు కాగలవు. ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులు తప్పవు. విదేశీ యత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు నూతన వాతావరణం, పరిచయాలు సంతృప్తి నిస్తాయి. వాహనం అమర్చుకోవాలనే మీ కోరిక ఫలిస్తుంది.
 
సింహం: ఏజెంట్లకు, బ్రోకర్లకు, రియల్‌ఎస్టేట్ వ్యాపారస్తులకు ఆందోళన తప్పదు. కొన్ని కారణాల రీత్యా మీ కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. విద్యార్థులలో నూతన ఉత్సాహం కనిపిస్తుంది. వస్త్ర, బంగారం, వెండి, లోహ వ్యాపారులకు పనివారలతో చికాకులు ఎదుర్కోవలసి వస్తుంది. ఖర్చులు అధికమవుతాయి.
 
కన్య: హోటల్, తినుబండారు వ్యాపారులకు సామాన్యంగా ఉంటుంది. ప్రియతములిచ్చే సలహా మీకెంతో సంతృప్తినిస్తుంది. అధైర్యం వదలి ధైర్యంతో ముందుకు సాగండి. అద్దె ఇంటి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధు, మిత్రులతో సరదాగా గడుపుతారు. స్త్రీలకు షాపింగ్ విషయాలలో మెళుకువ అవసరం.
 
తుల: ఆర్థిక లావాదేవీలు అనుకూలం. ఆడిటర్లకు చేజిరి పోయిందన్న కేసులు మరల తిరిగి వస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. బంధువుల ఇంట శుభసందర్భల్లో కీలకపాత్ర వహిస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. రోజంతా ఆహ్లాదకరంగా గడిచిపోతుంది. ఉద్యోగస్తులు ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు.
 
వృశ్చికం: కోర్టు వ్యవహారాలు వాయిదా పడుట మంచిది. ఉన్నతోద్యోగం లభించే అవకాశం ఉంది. విద్యార్థినులలో నూతనోత్సాహం చోటు చేసుకుంటుంది. రాజకీయ, కళారంగాల్లో వారు సన్మానాలు పొందుతారు. పాతరుణాలు తీసుస్తారు. మీ కళత్ర మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. బంధువుల రాకపోకలు అధికమవుతాయి.
 
ధనస్సు: దైవ, పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్త్రీల పేరిట స్థిరాస్తులు అమరుతాయి. మీకు నచ్చని సంఘటనలు కొన్ని ఎదురుకావచ్చు. బ్యాంకింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికం. వృత్తుల్లో వారికి ఆశాజనకం. రాబడికి మించిన ఖర్చులవుతాయి. విద్యార్థులకు టెక్నికల్, సైన్సు, కంప్యూటర్ రంగాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. 
 
మకరం: రిప్రజెంటేటివులకు సంతృప్తి కానవస్తుంది. మీ ఆలోచనలు క్రియా రూపంలో పెట్టండి. దంపతుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. పెద్దలతో బాధ్యతారహితంగా వ్యవహరించకండి. ప్రభుత్వ రంగాలలో వారికి మిత్రుల వల్ల సమస్యలు తలెత్తుతాయి. రాజకీయాలలో వారు తొందరపడి వాగ్ధానాలు చేయకండి.
 
కుంభం: స్వయంకృషితో అనుకున్నది సాధిస్తారు. ఉమ్మడి స్థిరాస్తి విక్రయించే విషయంలో సోదురులతో విభేదిస్తారు. రవాణా రంగాల వారికి చికాకులు తప్పవు. సోదరీ, సోదరుల మధ్య కలహాలు తలెత్తుతాయి. సినిమా కళాకారులకు అభిమాన బృందాలు అధికమవుతారు. భాగస్వాముల మధ్య నూతన విషయాలు చర్చకు వస్తాయి.
 
మీనం: రాజకీయాలలోని వారికి ప్రత్యర్థులు పెరుగుతున్నారని గమనించండి. ముక్కుసూటిగా పోయే మీ ధోరణి ఇబ్బందులకు దారితీస్తుంది. నూతన దంపతులు పరస్పరం మరింత చేరవవుతారు. వాణిజ్య ఒప్పందాలు వాయిదా వేయండి. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. మీ ఆశయసిద్ధికి అవరోధాలు కలుగుతాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు