29-08-2019 గురువారం రాశిఫలాలు - ఉద్యోగస్తులు ఇతర వ్యాపకాలు విడనాడి...

గురువారం, 29 ఆగస్టు 2019 (09:13 IST)
మేషం: ఉద్యోగస్తులకు అధికారుల తీరు ఎంతో ఆందోళన కలిగిస్తుంది. వాహనం పిల్లలకు ఇవ్వటం క్షేమం కాదు. మీ ప్రసంగాలు శ్రోతలను ఆకట్టుకుంటాయి. ఊహించని పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం ఉంది. ఉపాఘధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికం. స్త్రీలకు శారీరక రుగ్మతలు, పనివారలతో చికాకులు అధికం. 
 
వృషభం: ఆర్థిక వ్యవహారాల్లో ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. విద్యార్థులు బజారు తినుబండారాలు భుజించటం వల్ల అస్వస్థతకు లోనవుతారు. స్త్రీలకు టీ. వీ, కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం లభిస్తుంది. సంగీత, సాహిత్య కళాకారులకు మంచి గుర్తింపు లభిస్తుంది. ప్లీడర్లకు తమ క్లయింట్‌లు తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది.
 
మిధునం: ధనం కంటె ఆత్మగౌరవానికే ప్రాధ్యాన్యం ఇస్తారు. ప్రయాణాల్లో కొంత అసౌకర్యం కలిగినా నెమ్మదిగా సమసిపోతాయి. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లకు చికాకులను ఎదుర్కొంటారు. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసివస్తుంది. వివాదాస్పద విషయాల్లో మీ ప్రమేయం లేకుండా జాగ్రత్త వహించండి.
 
కర్కాటకం: మీ కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. ఉద్యోగస్తులు ఇతర వ్యాపకాలు విడనాడి స్థిరచిత్తంతో పనిచేయవలసి ఉంటుంది. మీ సంతానం విపరీత ధోరణి ఆందోళన కలిగిస్తుంది. గత సంఘటనలు అనుక్షణం జ్ఞప్తికివస్తాయి. ఉపాధ్యాయులకు పై అధికారుల నుంచి సమస్యలు తలెత్తుతాయి. జాగ్రత్త వహించండి.
 
సింహం: బంధువుల నుండి సమస్యలు తలెత్తుతాయి. విద్యార్థులకు పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. క్రీడాకారులకు ప్రోత్సాహకరం. బ్యాంకు వ్యవహారాలలో ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. వృత్తి వ్యాపారులకు అన్నివిధాల కలసిరాగలదు. కుటుంబీకుల ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉంటుంది.
 
కన్య: ఆర్థిక, మానసిక సమస్యలకు చక్కని పరిష్కార మార్గం గోచరిస్తుంది. కలిసివచ్చిన అవకాశాన్ని చక్కగా వినియోగించు కుంటారు. వ్యాపారులకు అన్ని విధాలా కలసిరాగలదు. భాగస్వామిక చర్చల్లో మీ ప్రతిపాదనలకు మంచి స్పందన లభిస్తుంది. ఉద్యోగ యత్నంలో నిరుద్యోగులకు బిడియం, అభిమానం కూడదు.
 
తుల: వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు మంచి ఫలితాలనిస్తాయి. ఆపత్సమయంలో ఆప్తులు అండగా ఉంటారు. సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. మంచి మాటలతో ఎదుటివారిని ప్రసన్నం చేసుకోవటానికి యత్నించండి. కలిసివచ్చిన అవకాశాన్ని చక్కగా వినియోగించుకుంటారు. 
 
వృశ్చికం: భాగస్వామిక చర్చల్లో మీ ప్రతిపాదనలకు మంచి స్పందన లభిస్తుంది. మీ వాహనం ఇతురులకిచ్చి ఇబ్బందులెదుర్కుంటారు. ఒక స్థిరాస్తి విక్రయంలో పునరాలోచన మంచిది. బ్యాంకు వ్యవహారాలలో పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. ఎంతటి విపత్కర పరిస్థితులనైనా నిబ్బరంగా ఎదుర్కుంటారు.
 
ధనస్సు: పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. ప్లీడర్లకు తమ క్లయింట్‌లు తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. వృత్తి వ్యాపారాల్లో ఆటుపోట్లు, పోటీని దీటుగా ఎదుర్కుంటారు. పలుకుబడి, మంచితనం కలిగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి.
 
మకరం: మీ వ్యాపకాలు తగ్గించుకుని కుటుంబ విషయాలపై శ్రద్ధ వహించండి. దూర ప్రయాణాలు ఉల్లాసం కలిగిస్తాయి. ఆలయాలను సందర్శిస్తారు. బ్యాంకులోన్లు, పర్మిట్లు మంజూరవుతాయి. బంధువులు మీ నుంచి పెద్దమొత్తంలో ధనసహాయం అర్ధిస్తారు. మీ ఉన్నతిని చూచి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి.
 
కుంభం: రాజకీయాల్లో వారికి ప్రత్యర్ధుల ద్వారా సమస్యలు ఎదుర్కొనక తప్పదు. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి, శ్రమాధిక్యత వంటివి తలెత్తుతాయి. ఎరువులు, మందులు, సుగంధ ద్రవ్య, ఆల్కహాలు వ్యాపారులకు అభివృద్ధి కానవస్తుంది. బ్యాంకు వ్యవహారాలలో చికాకులు తప్పవు. ముఖ్యమైన వ్యవహారాలు గోప్యంగా వుంచండి.
 
మీనం: సిమెంటు, కలప, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారులకు పురోభివృద్ధి. నిరుద్యోగులకు లభించిన అవకాశాలు తాత్కాలికమే అయిన సద్వినియోగం చేసుకోవటం మంచిది. వాతావరణంలో మార్పుల వలన వ్యవసాయదారులకు నూతన ఉత్సాహం కానరాగలదు. స్త్రీల వాక్‌చాతుర్యానికి మంచి గుర్తింపు లభిస్తుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు