03-12-2018 సోమవారం - దైవ సేవా కార్యక్రమాలలో....

సోమవారం, 3 డిశెంబరు 2018 (08:47 IST)
మేషం: మహిళా ఉద్యోగస్తులకు అధికారుల నుండి ఒత్తిడి, పనిభారం వంటి చికాకులు తప్పవు. సమయానికి చేతిలో ధనం లేకపోవడం వలన ఒకింత ఇబ్బందులు తప్పవు. ట్రాన్స్‌పోర్ట్, ట్రావెలింగ్ రంగాల వారికి అధికారిక వేధింపులు అధికం. ఒక స్థిరాస్తి అమర్చుకునే విధంగా మీ ఆలోచనలుంటాయి. 
 
వృషభం: బేకరీ, ఫ్యాన్సీ, పచారీ, స్టేషనరీ వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. దైవ, సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. ఉద్యోగస్తులకు అధికారుల గుర్తింపు, ప్రశంసలు లభిస్తాయి. మిత్రుల ప్రోత్సాహంతో నిరుద్యోగులు ఉపాధి పధకాలు చేపడతారు. బంధువు రాక పోకలు అధికమవుతాయి. 
 
మిధునం: కళా, క్రీడా, సాంకేతిక రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. మీ సమస్యలకు ఒక చక్కని పరిష్కార మార్గం లభిస్తుంది. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. స్త్రీలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి యత్నాలు మెుదలెడతారు. పత్రికా, ప్రైవేటు సంస్థలలోని వారికి ఒత్తిడి, పనిభారం అధికం. 
 
కర్కాటకం: ఆదాయ వ్యయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. రావలసిన ధనం వసూలు కావడంతో మీ ఆలోచనలు పొదుపు దిశగా ఉంటాయి. ఒక స్థిరాస్తి కొనుగోలుకు యత్నాలు ముమ్మరం చేస్తారు. వ్యాపారాభివృద్ధికి కొత్త కొత్త ప్రణాళికలు, పథకాలు రూపొందిస్తారు.   
 
సింహం: మీ నిర్ణయాలను, విశ్వాసాలను సమర్థించుకుంటారు. ఉద్యోగస్తులు పై అధికారుల నుండి ఒత్తిడి ఎదుర్కుంటారు. కుటుంబీకుల క్షేమం కోసం బాగా శ్రమిస్తారు. వృత్తుల వారికి శ్రమాధిక్యత మినహా ఆదాయం ఆశించినంతగా ఉండదు. ప్రతి విషయంలోను ఓర్పు, సర్దుబాటు ధోరణితో మెలగవలసి ఉంటుంది.   
 
కన్య: ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. ప్రయత్నపూర్వకంగా మెుండిబాకీలు, చికాకులు తప్పవు. వాతావరణంలో మార్పు వలన స్త్రీల ఆరోగ్యం మందగిస్తుంది. కంప్యూటర్ రంగాల వారికి ఒత్తిడి, చికాకులు తప్పవు. మీ ప్రమేయం లేకుండానే కొన్ని అవకాశాలు కలిగివస్తాయి. ప్లీడర్లకు క్లయింట్‌ల ధోరణి విసుగు కలిగిస్తుంది.   
 
తుల: పరిమితులను పట్టించుకోకుండా ఇతరులను ఆదుకుంటారు. వృత్తిరీత్యా ఆకస్మికంగా ప్రయాణం చేయవలసివస్తుంది. తలపెట్టిన పనులు మెుక్కుబడిగా పూర్తిచేస్తారు. ప్రైవేటు సంస్థలలోని వారికి, ఏజెంట్లు, బ్రోకర్లకు గుర్తింపు లేకపోగా మాటపడవలసి వస్తుంది. పెద్దల గురించి ఆందోళన చెందుతారు.  
 
వృశ్చికం: ప్రేమికుల మధ్య అనుబంధంలో స్తబ్ధత చోటు చేసుకుంటుంది. భాగస్వామిక చర్చల్లో కొంత పురోగతి ఉంటుంది. వాహనం నడుపుతున్నప్పుడు మెలకువ వహించండి. ఒక వ్యవహారం నిమిత్తం ప్లీడర్లతో సంప్రదింపులు జరుపుతారు. ఆస్తి పంపకాల విషయంలో పెద్దల తీరు నిరుత్సాహం కలిగిస్తుంది.  
 
ధనస్సు: వ్యాపార విస్తరణకోసం కీలకమైన ఒప్పందాలను కుదుర్చుకుంటారు. సంఘంలో ప్రత్యేక గుర్తింపు, గౌరవం ఏర్పడుతుంది. సన్నిహితులు, కుటుంబీకులతో కలిసి ఆలయాలను సందర్శిస్తారు. స్త్రీలకు షాపింగ్‌లోను, కొత్త వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు అనుకూలం. 
 
మకరం: ప్రింటింగ్ రంగాల వారికి అక్షరదోషాల వలన చికాకులు తప్పవు. మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికం. మితిమీరిన ఆలోచనలు మీ మనస్సును వ్యాకుల పరుస్తాయి. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలు సంతృప్తికరంగా సాగుతాయి. కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు పురోభివృద్ధి.     
 
కుంభం: వస్త్ర, ఫ్యాన్సీ, పచారీ, ఆల్కహాలు, రసాయన సుగంధ ద్రవ్య వ్యాపారులకు పురోభివృద్ధి. పెరిగన ధరలు, రాబడికి మించిన ఖర్చుల వలన అదనపు ఆదాయా మార్గాలు అన్వేషిస్తారు. దైవ, సేవా, పుణ్య కార్యాలకు ఇతోధికంగా సహాయం అందిస్తారు. మీ సంతానం అత్యుత్సాహాన్ని అదుపులో ఉంచడం శ్రేయస్కరం.    
 
మీనం: ఉద్యోగ రీత్యా నూతన పరిచయాలేర్పడుతాయి. ప్రేమికుల మధ్య అవగాహన లోపం, స్పర్దలు తలెత్తుతాయి. ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులు తప్పవు. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. కొత్తగా చేపట్టిన వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. మీ వాగ్ధాటితో ప్రముఖులను, అధికారులను ఆకట్టుకుంటారు.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు