శుక్రవారం (30-11-2018) దినఫలాలు - కొత్త పనులు చేపట్టకుండా...
శుక్రవారం, 30 నవంబరు 2018 (08:17 IST)
మేషం: వన సమారాధనలు, దైవ కార్యాల పట్ల ఆసక్తి కనబరుస్తారు. సమయానికి ధనం అందకపోవడం వలన ఇబ్బందులు ఎదుర్కుంటారు. కొన్ని విలువైన వస్తువులు అనుకోకుండా కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తుల శ్రమకు, అధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు.
వృషభం: స్త్రీలకు ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. మీ అతిధి మర్యాదలు ఎదుటివారిని సంతృప్తిపరుస్తాయి. మార్కెట్ రంగాల వారు తమ టార్గెట్లను అతికష్టంమ్మీద పూర్తిటచేస్తారు. ప్లీడర్లకు తమ క్లయింట్‌ల తీరు ఇబ్బందులకు దారితీస్తుంది. మీ అభిరుచి, ఆశయాలకు తగిన వ్యక్తులతో పరిచయాలేర్పడుతాయి.
మిధునం: కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహించండి. రాజకీయ నాయకులకు దూర ప్రయాణాలలో మెళకువ అవసరం. మీలో దయాగుణం వికసిస్తుంది. రేషన డిలర్లకు ఊహించని ఆటంకాలెదురవుతాయి. రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఊహించని ఇబ్బందులెదురవుతాయి.
కర్కాటకం: మీ శ్రీమతి సలహా పాటించడం చిన్నతంగా భావించకండి. ఆర్భాటాలకు పోకుండా ధనవ్యయం విషయంలో ఆచితూచి వ్యవహరించండి. వాహనం ఏకాగ్రతతో నడపవలసి ఉంటుంది. స్థిరాస్తి అమ్మకం యత్నాలు అనుకూలిస్తాయి. గృహానికి సంబంధించిన విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు.
సింహం: స్త్రీలు ఉపవాసాలు, శ్రమాధిక్యత కారణంగ స్వల్ప అస్వస్థతకు గురవుతారు. మీ నిజాయితీకి ప్రశంసలు లభిస్తాయి. ఒక కార్యసాధన కోసం ఒకటికి పదిసార్లు యత్నించాల్సి ఉంటుంది. మీ సంతానంకోసం బాగా శ్రమిస్తారు. ధనియాలు, ఆవాలు, పసుపు, ఎండుమిర్చి, నూనె వ్యాపారస్తులకు, స్టాకిస్టులకు అనుకూలంగా ఉండగలదు.
కన్య: ఆర్థిక విషయాల్లో గోప్యంగా వ్యవహరిస్తారు. అందరితో కలిగి విందు, వినోదాలలో పాల్గొంటారు. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. వాతావరణంలో మార్పు వలన స్త్రీల ఆరోగ్యం మందగిస్తుంది. రుణం తీర్చడానికి చేయు యత్నాలు ఫలించవు. విద్యార్థినులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది.
తుల: దైవారాధన పట్ల ఆశక్తి పెరుగుతుంది. ఇంతకాలం మీరెదురుచూస్తున్న అవకాశాలు మిమ్మల్ని వరిస్తాయి. మీ నిర్లక్ష్యం వలన విలువైన వస్తువు చేజారిపోతాయి. మీ ప్రమేయం లేకుండానే కొన్నిచిక్కు సమస్యలు పరిష్కారమవుతాయి. ఉద్యోగస్తులు ప్రతి విషయంలోను ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది.
వృశ్చికం: సంతాకాలం, హామీల విషయంలో ఏకాగ్రత వహించండి. స్త్రీలకు స్వీయ సంపాదన పట్ల ఆసక్తి పెరుగుతుంది. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. బంధువులు మీ నుండి ధనం లేక మరేదైనా ప్రతిఫలం ఆశిస్తారు. రాబడికి మించిన ఖర్చులెదురైనా ఆర్థిక వెసులుబాటు ఉంటుంది.
ధనస్సు: మీ మంచి కోరుకునేవారు కంటే మీ చెడును కోరేవారే ఎక్కువగా ఉన్నారు. స్త్రీలకు అనవసర ప్రసంగాలు అపార్ధాలకు దారితీస్తాయి. మెళకువ అవసరం. ద్విచక్ర వాహనంపై దూరప్రయాణాలు మంచిది కాదు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి లాభదాయకం. ప్రేమికుల అతి ప్రవర్తన అనర్ధానికి దారితీస్తుంది.
మకరం: ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికం. ఏ విషయంలోను ఇతరులపై ఆధారపడక స్వయంకృషినే నమ్ముకోవడం మంచిది. ప్రయాణాల్లో చికాకులు, అసౌకర్యానికి గురవుతారు. విందులలో పరిమితి పాటించండి. స్త్రీలకు స్వీయ సంపాదన పట్ల ఆసక్తి ఏర్పడుతుంది. గతానుభవాలు జ్ఞప్తికి రాగలవు.
కుంభం: విద్యార్థులు ఇతరుల వాహనం నడిపి ఇబ్బందులకు గురికాకండి. మీ స్థోమతకు మంచిన వాగ్దానాల వలన ఇబ్బందులు ఎదుర్కుంటారు. నిరుద్యోగులు బోగస్ ప్రకటనలు వలన మోసపోయే ఆస్కారం ఉంది. విందు వినోదాలలో పాల్కొంటారు. భాగస్వామికి వ్యాపారాల నుండి విడిపోవాలనే ఆలోచన బలపడుతుంది.
మీనం: పుణ్యక్షేత్రాల దర్శనం వలన మానసిక ప్రశాంతత చేకూరుతుంది. మీ అతి చనువును ఇతరులు అపార్థం చేసుకునే ఆస్కారం ఉంది. ఇంటా బయటా చికాకులు పెరిగే అవకాశం ఉంది. ప్రయాణాల్ల అసౌకర్యానికి గురవుతారు. కీలకమైన వ్యవహారాల్లో మెళకువ వహించండి. స్త్రీల మాటకు వ్యతిరేకత ఎదురవుతుంది.