05-07-2020 ఆదివారం రాశిఫలాలు

ఆదివారం, 5 జులై 2020 (05:00 IST)
మేషం : ఆదాయం బాగున్నా ఆర్థిక సంతృప్తి ఉండదు. సభలు, సమావేశాల్లో అందరినీ ఆకట్టుకుంటారు. మీ ఏమరుపాటుతనం వల్ల విలువైన వస్తువులు, పత్రాలు చేజారిపోయే ఆస్కారం ఉంది. పెద్దల ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. అనుకోని కారణాల వల్ల ఆకస్మిక ప్రయాణం చేయవలసి వస్తుంది. 
 
వృషభం : ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు. కొబ్బరి, పండ్లు, పూల, చిరు వ్యాపారులకు కలిసిరాగలదు. కుటుంబంలో ఒకరి ధోరణి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. సంఘంలో గుర్తింపు రాణింపు లభిస్తుంది. కీలకమైన విషయాల్లో జాగ్రత్త అవసరం. వాయిదాపడిన పనులు పునఃప్రారంభిస్తారు. 
 
మిథునం : కొత్త ప్రదేశాల సందర్శనం పట్ల ఆసక్తి పెరుగుతుంది. బంధువర్గాలతో ఇల్లు సందడిగా ఉంటుంది. మీ వాహనం ఇతరులకి ఇచ్చి ఇబ్బందులకు గురువుతారు. స్త్రీలకు షాపింగ్ విషయాలలో అప్రమత్తత అవసరం. ప్రింటింగ్ రంగాల్లో వారికి అచ్చు తప్పులు దొర్లుట వల్ల పై అధికారులతో మాటపడాల్సి వస్తుంది. 
 
కర్కాటకం : ముందుచూపుతో వ్యవహరించడం చాలా మంచిది. ఫ్యాన్సీ, కిళ్లీ, కిరాణా రంగాలలో వారికి చిరు వ్యాపారులకు అనుకూలం. స్త్రీలకు బంధువులు, చుట్టుపక్కల వారితో సత్సంబంధాలు నెలకొంటాయి. రావలసిన మొండిబాకీలు సైతం వసూలవుతాయి. ఉపాధ్యాయులకు విశ్రాంతికై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. 
 
సింహం : ప్రయాణాల్లో తొందరపాటుతనం అంత మంచిది కాదని గనించండి. ఒక ప్రకటనల పట్ల ఆకర్షితులవుతారు. ఆత్మీయుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. హోటల్, క్యాటరింగ్ పనివారలకు కలిసిరాగలదు. ప్రియతములతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. 
 
కన్య : అకాలభోజనం, శ్రమాధిక్యత వల్ల స్వల్ప అస్వస్థతకు గురవుతారు. హామీలకు దూరంగా ఉంటడం శ్రేయస్కరం. విద్యార్థులకు శ్రమకు తగిన ఫలితం పొందుతారు. స్త్రీలు, షాపింగ్ వ్యవహారాలో మెళకువ అవసరం. దైవ కార్యక్రమాల పట్ల ఏకాగ్ర వహిస్తారు. మీ అభిప్రాయాలు ఆలోచనలు గోప్యంగా ఉంచడం మంచిది. 
 
తుల : కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్నవాటిపైనే శ్రద్ధ వహించండి. సోదరులతో ఏకీభవించలేకపోతారు. సంఘంలో మీ మాటకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. మత్స్యు, కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకం. వైవాహిక జీవితంలో అనుకోని చికాకులు తలెత్తుటకు ఆస్కారం ఉంది. జాగ్రత్త  వహించండి. 
 
వృశ్చికం : ఆర్థిక వ్యవహారాల కారణంగా మనశ్సాంతి లోపిస్తుంది. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. బంధు మిత్రులను కలుసుకుంటారు. మీ కార్యక్రమాలు, పనులు వాయిదావేసుకోవలసి వస్తుంది. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. 
 
ధనస్సు : స్త్రీలకు బంధువుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. నిరుద్యోగులకు ప్రముఖుల సిఫార్సులతో సదావకాశాలు లభిస్తాయి. క్రీడా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. కుటుంబ సభ్యుల వైఖరి ఆవేదన కలిగిస్తుంది. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. వాహనం నడుపుతున్నపుడు మెలకువ వహించండి. 
 
మకరం : వృత్తి వ్యాపారాలకు సంబంధించి ఓ సమాచారం నిరుత్సాం కలిగిస్తుంది. స్త్రీలకు పనివారలతో చికాకులను ఎదుర్కొంటారు. రవాణా రంగాలలోని వారికి ఒత్తిడి, చికాకులు అధికం. విందులలో పరిమితి పాటించండి. ప్రముఖులతో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. గౌరవ ప్రతిష్టలు పెరిగే అవకాశం ఉంది. 
 
కుంభం : కొబ్బరి, పండ్లు, పూల, కూరగాయల వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. రాజకీయ నాయకులకు విదేశీ ప్రయాణాలలో మెళకువ అవసరం. ఖర్చులు అధికమవుతాయి. మిత్రుల రాక వల్ల చేపట్టిన పనులు ఆటంకాలు ఎదురవుతాయి. శ్రీవారు, శ్రీమతి విషయాల్లో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి. 
 
మీనం : ఎంత కష్టమైన పనైనా అవలీలగా పూర్తిచేస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు వచ్చినప్పటికి వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతారు. ప్రయాణాలలో తొందరపాటుతనం అంత మంచిదికాదని గనించండి. ఇంట్లో వృత్తి వ్యాపారాల్లో మార్పులు, చేర్పులకు ప్రయత్నిస్తారు. సహోద్యోగులతో వాగ్వివాదాలకు దిగకండి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు