04-07-2020 శనివారం రాశిఫలాలు (video)

శనివారం, 4 జులై 2020 (05:00 IST)
మేషం : విద్యా సంస్థలలోని వారికి అనుకూలంగా ఉండగలదు. ఉద్యోగ రీత్యా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అధికారుల ఇంటర్వ్యూల కోసం నిరీక్షిస్తారు. ఉమ్మడి వ్యాపారాలు, ఉమ్మడి వెంచర్లు సంతృప్తినిస్తాయి. కటుంబీకుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తారు. పాత వస్తువులను కొని సమస్యలు తెచ్చుకోకండి. 
 
వృషభం : తలపెట్టిన పనులు నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు, వ్యాపకాలు పెంపొందుతాయి. దైవ, సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యా సంస్థలలోని వారికి అనుకూలంగా ఉండగలదు. దేవాలయ, విద్యా సంస్థలకు దానధర్మాలు చేయుట వల్ల మీ కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. 
 
మిథునం : చిన్నారుల ప్రవర్తన అవేదన కలిగిస్తుంది. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. కుటుంబంలోనూ, బయటా ఊహించని సమస్యలు తలెత్తుతాయి. నిరుద్యోగులు నిరుత్సాహం విడనాడి శ్రమించినా సదావకాశాలు లభిస్తాయి. 
 
కర్కాటకం : రవాణా రంగాల వారికి చికాకులు తప్పవు. మీపై శకునాలు, సెంటిమెంట్ల ప్రభావం అధికంగా ఉంటుంది. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహించండి. హోల్‍సేల్, రిటైల్ వ్యాపారులకు పురోభివృద్ధి. ప్రయాణాలలో పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. 
 
 
సింహం : ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. మీ సేవాదక్షత, కార్యదీక్షలకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఆప్తులతో నిజాయితీగా మెలగండి. స్త్రీలు తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులు పై అధికారులతో ఎలా మాట్లాడినా తప్పుగానే భావిస్తారు. 
 
కన్య : మీ కళత్ర విపరీత ధోరణి చికాకు పరుస్తుంది. ఎంతో కొంత పొదపు చేయాలన్న మీ ఆలోచన ఫలిస్తుంది. ఖర్చులు అదుపుకాకపోగా, మరింత ధనవ్యయం అవుతుంది. స్త్రీలకు పనివారితో చికాకులు తప్పవు. కోర్టు వ్యవహారాలు, ఆస్తి తగాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. 
 
తుల : బంధువులపై మీరు పెట్టుకున్న ఆశలు అడియాసలు అవుతాయి. ప్రముఖులను కలుసుకుంటారు. విద్యార్థుల మొండివైఖరి ఉపాధ్యాయులకు ఎంతో చికాకు కలిగిస్తుంది. వృత్తుల వారికి ఎంత శ్రమించినా ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఫ్లీడర్లకు తమ క్లయింట్ల తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. 
 
వృశ్చికం : వైద్యులకు ఆపరేషన్లు చేయునపుడు మెళకువ అవసరం. ఉద్యోగస్తుల దైనందిన కార్యక్రమాల్లో మార్పులుండవు. ఒక్కోసారి మీ జీవిత భాగస్వామి మనస్తత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. వీలైనంత వరకు మీ పనులు మీరే చూసుకోవడం ఉత్తమం. బ్యాంకు వ్యవహారాలలో పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి.
 
ధనస్సు : కుటుంబీకుల కోసం ధనం బాగా వ్యయం చేయవలసి వస్తుంది. క్లిష్టమైన సమస్యలు తలెత్తినా సమర్థతతో ఎదుర్కొంటారు. ఉపాధ్యాయులతో విద్యార్థులు ఏకీభవించలేకపోతారు. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాల్లోనూ, వస్తు నాణ్యతలోనూ మెలకువ అవసరం. ప్రతి ఒక్కరూ సలహా ఇచ్చేవారేగానీ సహాయం చేసేవారే ఉండరు. 
 
మకరం : ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి అవకాశాలు లభిస్తాయి. మీ సంతానం కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. ఐరన్, సిమెంట్, కలప రంగాలలో వారికి నిరుత్సాహం తప్పదు. తలపెట్టిన పనులు నిర్విఘ్నంగా పూర్తిచేస్తారు. విదేశాలు వెళ్లేందుకు చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. 
 
కుంభం : రాజకీయ నాయకులు సభా సమావేశాలలో పాల్గొంటారు. బిల్డింగ్ కాంట్రాక్టర్లకు తాపి పనివారితో సమస్యలు తలెత్తుతాయి. మీ అశ్రద్ధ ఆలస్యాల వల్ల కొన్ని చికాకులు ఎదుర్కొనక తప్పదు. ఉద్యోగస్తులు ఒత్తిడి, ప్రలోభాలకు దూరంగా ఉండటం మంచిది. పాత సమస్యలు పరిష్కార మార్గంలో నడుస్తాయి. 
 
మీనం : స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి మంచి మంచి అవకాశాలు సంతృప్తినిస్తాయి. మందులు, కిరణా, ఫ్యాన్సీ, రసాయన సుగంధ ద్రవ్య వ్యాపారులకు కలిసిరాగలదు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులు విసుగు కలిగించినా మొండిగా పూర్తి చేస్తారు. స్త్రీలు షాపింగ్ విషయాలలో మెళకువ వహించండి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు