05-10-2019- శనివారం మీ రాశిఫలాలు - స్త్రీలు చేపట్టిన పనులలో...

శనివారం, 5 అక్టోబరు 2019 (09:46 IST)
మేషం: డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. స్థిరాస్తి క్రయ విక్రయాలకు సంబంధించిన వ్యవహారాలలో మెళుకువ అవసరం. ఆకస్మిక ఖర్చులు, కుటుంబ అవసరాలు పెరుగుతాయి. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. వాహనం ఇతరులకు ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. 
 
వృషభం: స్త్రీలు చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు, ఒత్తిడి ఎదుర్కుంటారు. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. నిరుద్యోగులకు ఆశాజనకం. సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. ఇతరుల సలహాను పాటించి మీ గౌరవాన్ని నలబెట్టుకుంటారు.
 
మిధునం: ఉద్యోగస్తుల సమర్థతకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. స్త్రీలు శుభకార్యాల్లో అందరినీ ఆకట్టుకుంటారు. ఇతరులు మీ గురించి చేసిన వ్యాఖ్యానాలు కలవరపరుస్తాయి. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ధ వహించండి. 
 
కర్కాటకం: ఆపత్సమయంలో మిత్రులు ఆదుకుంటారు. వాహన చోదకులకు ఊహించని ఆటంకాలు ఎదురవుతాయి. స్త్రీల పేరిట స్థిరాస్తులు సమకూర్చుకుంటారు. విదేశీయానం కోసం చేసే యత్నాలు అనుకూలిస్తాయి. దైవ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. మీ కార్యక్రమాలు వాయిదా వేసుకోవలసి వస్తుంది.
 
సింహం: విద్యార్థులకు చదువుల్లో ఏకాగ్రత లోపించటం వల్ల ఆందోళనకు గురవుతారు. దైవ, సేవా, పుణ్య కార్యాలకు సహాయ సహకారాలు అందిస్తారు. నిరుద్యోగులకు ప్రముఖుల సిఫార్సులతో సదవకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు తోటివారి కారణంగా ఒత్తిడి, పనిభారం అధికమవుతాయి. కొత్త వ్యక్తులతో అప్రమత్తంగా మెలగండి. 
 
కన్య: కొబ్బరి, పండ్ల, పూల వ్యాపారులకు ఆశాజనకం. ప్రతి పనిలోను ఎదుటివారి నుండి విమర్శలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. రావలసిన ధనం వసూలు విషయంలో శ్రమాధిక్యత, ప్రయాసలు ఎదుర్కుంటారు. బంధుమిత్రులతో ఉల్లసంగా గడుపుతారు.
 
తుల: బ్యాంకింగ్ వ్యవహారాలలో మెళకువ వహించండి. అందరితోను కలుపుగోలుగా వ్యవహరించి మీ పనులు చక్కబెట్టుకుంటారు. ట్రాన్స్‌‌పోర్ట్, ఎక్స్‌‌పోర్ట్, ట్రావెలింగ్ రంగాల్లో వారికి కలిసిరాగలదు. బంధువుల, సోదరుల మధ్య ఆత్మీయతలు నెలకొంటాయి. జీవనోపాధికి సొంతంగా ఏదైనాచేయాలి అనే ఆలోచన స్ఫురిస్తుంది. 
 
వృశ్చికం: ఎవరికైన ధన సహాయం చేసినా తిరిగిరాజాలదు. జాగ్రత్త వహించండి. అధికారులతో సంభాషించేటప్పుడు మెళకువ అవసరం. అయినవారిని అనుమానించడం వల్ల మానసిక అశాంతికి లోనవుతారు. మీ సంతానం విద్యా విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. చిన్నారులు, ప్రియతములతో ఉల్లాసంగా గడుపుతారు.  
 
ధనస్సు: స్త్రీలకు బంధువులతో పట్టింపులొస్తాయి. పుణ్యక్షేత్ర సందర్శనల పట్ల మక్కువ పెరుగుతుంది. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో పునరాలోచన మంచిది. తలపెట్టిన పనులు ఆశించినంత చురుకుగా సాగవు. భాగస్వామ్య రంగంలో వారికి చికాకులు తలెత్తును. చిన్నతరహా పరిశ్రమలలో వారికి అభివృద్ధి కానవస్తుంది.  
 
మకరం: పందాలు, బెట్టింగులకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. అయినవారి ఆదరాభిమానాలు పొందుతారు. బ్యాంకింగ్ రంగాల వారికి పనిలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. కంపెనీల ప్రభుత్వసంస్థలతో లావాదేవీలు ఫలిస్తాయి. శత్రవులు మిత్రులుగా మారతారు. వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత వహించండి.
 
కుంభం: రవాణా రంగంలోవారికి సంతృప్తి కానవస్తుంది. దైవ పుణ్య కార్యక్రమాలలో పాల్గొంటారు. ఊహించని అవకాశాలు వస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి. ప్రైవేటు సంస్థలలోవారు వారి అశ్రద్ధ, ఆలస్యాల వలన ప్రభుత్వ అధికారుల నుంచి చికాకులు ఎదుర్కుంటారు. ప్రయాణాలలో మెళుకవ అవసరం.
 
మీనం: ఆర్థిక విషయాలలో చురుకుదనం కానవచ్చును. ప్రత్తి, పొగాకు రంగాలలో వారికి అనుకూలమైన రోజు. వ్యాపారాభివృద్ధికి చేసే కృషిలో బాగా రాణిస్తారు. రాజకీయ రంగాల్లో వారికి కొంత చికాకులు ఎదురవుతాయి. స్థిరచరాస్తుల విషయం గురించి చర్చిస్తారు. మీరు ఓ స్నేహితునితో కలిసి మీ లక్ష్యాన్ని చేరుకోవటానికి కృషిచేస్తారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు