30-09-2019 సోమవారం దినఫలాలు - మీ సమస్య ఒకటి...

సోమవారం, 30 సెప్టెంబరు 2019 (09:09 IST)
మేషం: ఉద్యోగస్తులు తరుచు సమావేశాల్లో పాల్గొంటారు. వాహనం నడుపుతున్నపుడు మెలకువ వహించండి. ఎంతో కొంత పొదుపు చేయాలన్న మీ లక్ష్యం నెరవేరకపోవచ్చు. స్త్రీల పట్టుదల, మాటతీరు ఇబ్బందులకు దారితీస్తుంది. వస్త్ర, బంగారం, వెండి, లోహ వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండాలి. 
 
వృషభం: విద్యార్థులు వాహనం నిర్లక్ష్యంగా నడిపి ఇబ్బందులకు గురవుతారు. కలప, ఐరన్, ఇటుక, ఇసుక, సిమెంటు వ్యాపారులకు మిశ్రమ ఫలితం. అరుదైన శస్త్రచికిత్స వైద్యులు విజయవంతంగా పూర్తిచేస్తారు. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. మీ ఆలోచనలు, పథకాలు గోప్యంగా ఉంచండి. 
 
మిధునం: రిప్రజెంటేటివ్‌‌‌లు, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. ఒక పుణ్యక్షేత్ర సందర్శించాలనే కోరిక స్ఫురిస్తుంది. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. స్త్రీలకు అయిన వారి నుంచి ఒక ముఖ్య సమాచారం అందుతుంది. ప్రముఖుల సహకారంతో మీ పనులు సానుకూలమవుతాయి. 
 
కర్కాటకం: విదేశాలు వెళ్ళే ప్రయత్నాల్లో సఫలీకృతులవుతారు. చిట్స్, ఫైనాన్సు వ్యాపారులకు ఒత్తిడి తప్పదు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్, సాంకేతిక రంగాల వారికి ఆశాజనకం. మీ మాటలు ఇతరులకు జారవేసే వ్యక్తులున్నారని గమనించండి. సహకార సంఘాల్లో వారికి, ప్రైవేటు సంస్థల్లో వారికి గుర్తింపు లభిస్తుంది.
 
సింహం: ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. ఆపద సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు. మిత్రులతో సంభాషించటం వల్ల మీలో మానసిక ధైర్యం, కొత్త ఉత్సాహం చోటుచేసుకుంటాయి. బంధువుల గురించి ఆశ్చర్యకరమైన విషయాలు వినవలసివస్తుంది. క్రయ విక్రయాలు బాగున్నా అంత లాభసాటిగా ఉండవు.
 
కన్య: రేషన్ డీలర్లకు ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. స్త్రీలకు పుట్టింటిపై ధ్యాస మళ్ళుతుంది. మిమ్మల్ని హేళన చేసే వారు మీ సహాయాన్ని అర్థిస్తారు. ప్రయాణాల్లో చురుకుదనం కానవస్తుంది. ఉద్యోగస్తులకుపై అధికారుల నుంచి ఒత్తిడి, తోటివారి వల్ల చికాకులు తప్పవు. అతిధి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు.
 
తుల: ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. స్త్రీలకు ప్రకటనలు, అపరిచిత వ్యక్తులపట్ల ఏకాగ్రత అవసరం. సందర్భానుకూలంగా సంభాషించి సమస్యలకు దూరంగా ఉండండి. భాగస్వామిక వ్యాపారాలు, ఉమ్మడి వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. ఆశ వదిలేసుకున్న ఒక అవకాశం మీకే అనుకూలిస్తుంది.
 
వృశ్చికం: కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయల వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి. మీ సమస్య ఒకటి సానుకూలం కావటంతో మానసికంగా కుదుటపడతారు. రుణం తీర్చాలనే మీ యత్నం నెరవేరగలదు. మీ సంతానం అత్యుత్సాహం అనర్థాలకు దారితీస్తుంది. మీ శ్రీమతి సూటిపోటి మాటలు అసహనం కలిగిస్తాయి.
 
ధనస్సు: రాజకీయనాయకులకు ఆందోళనలు అధికమవుతాయి. ఎదుటి వారినుండి విమర్శలు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. ఋణం ఏ కొంతైనా తీరుస్తారు. ఒక వ్యవహారం నిమిత్తం న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతారు. నూనె, మిర్చి, కంది వ్యాపారస్తులకు, స్టాకిస్టులకు పురోభివృద్ధి.
 
మకరం: బృందకార్య క్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. రాబడికి మించిన ఖర్చులెదురైనా తట్టుకుంటారు. పోస్టల్, కొరియర్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం తప్పవు. కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో నిలదొక్కుకోవటానికి మరింతగా శ్రమించాల్సి ఉంటుంది. పనులు వాయిదా పడుటవల్ల ఆందోళన చెందుతారు.
 
కుంభం: మీ కళత్ర వైఖరి మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది. పెద్దలతో సంభాషించేటపుడు మెలకువ చాలా వహించండి. దంపతుల మధ్య అవగాహనాలోపం చికాకులు వంటివి చోటుచేసుకుంటాయి. పట్టు విడుపు ధోరణితో వ్యవహరించడం వల్ల కొన్ని పనులు మీకు సానుకూలమవుతాయి. మొండి బాకీలు వసూలు కాగలవు.
 
మీనం: దైవ సేవా కార్యక్రమాలలో ఇబ్బందులను ఎదుర్కుంటారు. రాజకీయనాయకులకు కార్యక్రమాలు వాయిదా పడతాయి. సోదరీ,  సోదరుల మధ్య కలహాలు తలెత్తుతాయి. కాంట్రాక్టర్లకు నూతన టెండర్లు చేతికందుతాయి. విదేశీయత్నాలు ఫలిస్తాయి. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో నూతన పరిచయా లేర్పడతాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు