06-04-2020 సోమవారం మీ రాశిఫలాలు - ఈశ్వరుడిని పూజిస్తే...

సోమవారం, 6 ఏప్రియల్ 2020 (05:00 IST)
మేషం : కూర, పూల, వ్యాపారస్తులకు సంతృప్తికానవచ్చును. చిన్న చిన్న విధులను సైతం ఎక్కువ శ్రద్ధతో నిర్వర్తించే ప్రయత్నం చేయండి. కొంతమంది ముఖ్యమైన విషయాలలో మిమ్మల్ని సంప్రదిస్తారు. మిత్రులతో కలిసి విందులు, వినోదాలలో పాల్గొంటారు. మిమ్మల్ని పొగిడేవారే కానీ సహకరించేవారుండరు. 
 
వృషభం : ఫైనాన్స్, చిట్‌ఫండ్ రంగాలలో వారికి అనుకూలమైన కాలం. ప్రయాణాలలో మెళకువ అవసరం. రచయితలకు, పత్రికా మీడియా రంగాలలో వారికి కీర్తి, గౌరవాలు పెరుగుతాయి. ఆటోమొబైల్, రవాణా మెకానికల్ రంగాల్లో వారికి చికాకులు తప్పవు. ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు శారీరక పటుత్వం నెలకొంటుంది. 
 
మిథునం : దైవ కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీరు తీసుకున్న నిర్ణయానికి ప్రముఖు నుంచి ఆదరణ లభిస్తుంది. వారసత్వపు వ్యవహారాలలో ఒత్తిడి, చికాకులు ఎదుర్కొంటారు. హోటల్, తినుబండ వ్యాపారస్తులకు సంతృప్తికానవచ్చును. స్త్రీలకు బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. 
 
కర్కాటకం : స్త్రీలకు స్వీయ అర్జనపట్ల ఆసక్తి, ప్రోత్సాహం లభిస్తాయి. విద్యార్థినులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. సంఘంలో మీ మాటపై నమ్మకం, గౌరవం పెరుగుతాయి. విదేశాలు వెళ్లాలనే మీ కోరిక త్వరలోనే నెరవేరబోతుంది. మీ అభిప్రాయాలను ఇతరులపై బలవంతంగా రుద్దడం మంచిదికాదని గమనించండి. 
 
సింహం : రాజకీయ కళారంగాల వారికి సామాన్యంగా ఉంటుంది. కొంతమంది మీ నుంచి సమాచారం సేకరించేందుకు యత్నిస్తారు. వాహనం ఇతరులకు ఇచ్చే విషయంలో పునరాలోచన అవసరం. మీరు దేనిని నమ్ముతారో ఆ విషయమై ఇతరులతో ధైర్యంగా మాట్లాడండి. పాత మిత్రుల కలయికతో మీలో కొంతమార్పు సంభవిస్తుంది. 
 
కన్య : బంధువుల నుంచి ముఖ్యమైన సమాచారం అందుతుంది. విదేశీయాన యత్నాలు ఫలిస్తాయి. దూర ప్రయాణాలలో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. పత్రికా రంగంలోకి వారికి గుర్తింపు రాణింపు లభిస్తుంది. స్త్రీలకు, వస్తు, వస్త్ర ఆభరణాలకు అధికంగా ఖర్చు చేస్తారు. అందరితో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. 
 
తుల : ఏవైనా చిన్న చిన్న సమస్యలు తలెత్తినా తాత్కాలికమేనని గ్రహించండి. రుణాల కోసం అన్వేషిస్తారు. కొబ్బరి, పండ్లు, పూలు, చల్లని పానీయ వ్యాపారులకు లాభదాయకం. ఉద్యోగస్తులు సభలు, సమావేశాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. పరిశోధనాత్మక విషయాలపై ఆసక్తి చూపుతారు. స్త్రీ ఆరోగ్యంలో మెళకువ అవసరం. 
 
వృశ్చికం : అవసరమైన వస్తువులు సమయానికి కనిపించకపోవచ్చు. కార్యసాధనంలో ఓర్పు, ఏకాగ్రత పట్టుదల అవసరం. భాగస్వామ్యుల మధ్య అసందర్భపు మాటలు తలెత్తే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. రాజకీయాలలో వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. ఇతరులకు ఉచిత సలహా ఇచ్చి ఇబ్బందులకు గురికాకండి. 
 
ధనస్సు : దైవ, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ముఖ్యుల కోసం బహుమతులు అందజేస్తారు. మీ ఆలోనచలు పంచుకునే వారి కోసం మనసు తహతహలాడుతుంది. స్త్రీలకు ఒత్తిడి, పనిభారం. మీ మిత్రుల కోసం బంధువుల కోసం బరువు బాధ్యతలు స్వీకరిస్తారు. కొత్త ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. 
 
మకరం : ప్రకటనలు, రాజకీయ కళా రంగాల వారికి ప్రోత్సాహకరం. పాత జ్ఞాపకాల గురించి మీ మిత్రులతో చర్చించడంలో ఉల్లాసాన్ని పొందుతారు. ప్రయాణాలు ఉల్లాసం కలిగిస్తాయి. కుటుంబీకుల పట్ల ఆసక్తి పెరుగును. ఆలయాలను సందర్శిస్తారు. దంపతుల మధ్య చిన్నచిన్న కలహాలు ఏర్పడతాయి. 
 
కుంభం : కుటుంబీకుల గురించి ఆందోళన చెందుతారు. ఊహించని ఖర్చు వల్ల చేబదుళ్లు తప్పవు. ఇంటర్వ్యూలలో ఏకాగ్రత వహించిన ఫలితం పొందుతారు. ఉమ్మడి వ్యాపారాలు సంతృప్తికరంగా సాగవు. రాజకీయ నాయకులు కొంత సక్షోభం ఎదుర్కొనక తప్పదు. మిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు. 
 
మీనం : సన్నిహితులతో కలిసి విందులు, వినోదాల్లో చురుకుగా పాల్గొంటారు. విదేశీ యత్నాల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కొంటారు. ప్రశాంతత కోసం ప్రయత్నిస్తారు. పెద్దల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించుట మంచిది. ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. ప్రముఖులతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు