06-09-2019- శుక్రవారం దినఫలాలు - గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగే...

శుక్రవారం, 6 సెప్టెంబరు 2019 (08:53 IST)
మేషం: రాజకీయ నాయకులు సభలు, సన్మానాల్లో పాల్గొంటారు. స్త్రీలు పనివారలను ఓ కంటకనిపెట్టటం మంచిదని గమనించండి. ఉద్యోగస్తుల దైనందిన కార్యకలాపాలు సజావుగా సాగుతాయి. మెడికల్, ఇంజనీరింగ్ విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ధనం మితంగా వ్యయం చేయాలి.
 
వృషభం: మీ గౌరవ ప్రతిష్టలకు భంగం పెరిగే కలిగేందుకు కొంతమంది యత్నిస్తారు. దంపతుల మధ్య సఖ్యత లోపిస్తుంది. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో విజయాన్ని పొందుతారు. పారిశ్రామిక వేత్తలు, కాంట్రాక్టర్లకు అధికారుల నుంచి అభ్యంతరాలెదురవుతాయి. కోర్టు వాదోపవాదాల్లో ప్లీడర్లకు గుర్తింపు, రాణింపు లభిస్తుంది.
 
మిధునం: ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ సభ్యులను సంప్రదించటం క్షేమదాయకం. బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. వ్యాపారాల్లో ఆటుపోట్లు తొలిగి అనుభవం గడిస్తారు. ఆత్మీయుల ద్వారా అందిన సమాచారం మిమ్ములను తీవ్రంగా ఆలోచింప చేస్తుంది. ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు లభిస్తుంది.
 
కర్కాటకం: మిమ్ములను అభిమానించే వ్యక్తులను కలుసుకుంటారు. మిమ్ములను ఆందోళనకు గురిచేసిన సమస్య తేలికగా పరిష్కారమవుతుంది. ఖర్చులు అధికం. వాణిజ్య ఒప్పందాలు, రిజిస్ట్రేషన్ వ్యవహారాల్లో మెళకువ వహించండి. స్త్రీల ఆరోగ్యం కుదుటపడుతుంది. రోజులు భారంగా, మందకొడిగా సాగుతాయి.
 
సింహం: ప్రైవేటు సంస్థలలోని వారికి ప్రతి విషయంలోను ఏకాగ్రత చాలా అవసరం. గృహ నిర్మాణాలు, మరమ్మతులు అనుకూలిస్తాయి. సిమెంటు, కలప, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి కానవస్తుంది. వాహన చోదకులకు ఊహించని చికాకులు తలెత్తుతాయి. కోర్టు వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి.
 
కన్య: నూతన వ్యాపారాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. అవివాహితులు, నిరుద్యోగులకు శుభదాయకం. రచనలు, క్రీడలు, కళల పట్ల ఆసక్తి కనబరుస్తారు. అదనపు సంపాదన పట్ల దృష్టి సారిస్తారు. విదేశీయాన యత్నాలకు సంబంధించిన ఆటంకాలు తొలగిపోగలవు. చేపట్టిన పనులు ఎంతో శ్రమించిన గాని పూర్తికావు.
 
తుల: ఉద్యోగస్తులు తోటివారి వల్ల అధికారులతో మాటపడవలసి వస్తుంది. ఖర్చులు, తప్పనిసరి చెల్లింపుల వల్ల ఆటుపోట్లు తప్పవు. గత కొంతకాలంగా చికాకు పరుస్తున్న సమస్యలు పరిష్కారమవుతాయి. బిల్డర్లకు నిర్మాణ పనులలో ఏకాగ్రత చాలా అవసరం. మీ సంతానం ఆరోగ్యం విషయంలో మెళకువ వహించండి.
 
వృశ్చికం: స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. తీర్థయాత్రలు, దైవ, సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయల వ్యాపారులకు పురోభివృద్ధి. మీ ఔన్నత్యాన్ని బంధు మిత్రులు గుర్తిస్తారు. చేపట్టిన పనులు ఒక పట్టాన పూర్తి కావు. రావలసిన ధనం అనుకోకుండా వసూలవుతుంది.
 
ధనస్సు: ఆర్థిక వ్యవహారాలు, నూతన వ్యాపారాల పట్ల శ్రద్ధ వహిస్తారు. ఖర్చులు, కుటుంబ అవసరాలు పెరుగుతాయి. గృహంలో ఒక శుభకార్యం చేయాలనే ఆలోచన స్ఫురిస్తుంది. సంఘంలో గుర్తింపు లభిస్తుంది. వాణిజ్య ఒప్పందాలు, లీజు, ఏజెన్సీలు, కుదుర్చుకోవటానికి మరి కొంత కాలం వేచియుండటం మంచిది.
 
మకరం: భాగస్వామిక చర్చలు ప్రశాంతంగా ముగుస్తాయి. విద్యార్థులకు ధ్యేయం పట్ల అవగాహన ఏర్పడుతుంది. నిత్యావసర వస్తు స్టాకిస్టులు, వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి. లీజు, ఏజెన్సీలు, నూతన టెండర్ల వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. ప్రేమికులకు పెద్దల నుంచి చికాకులు, మందలింపులు తప్పవు.
 
కుంభం: పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. స్త్రీలకు షాపింగ్‌లోను, వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత, మెళుకువ అవసరం. శాస్త్ర, సాంకేతిక రంగాల వారికి ప్రోత్సాహకరం. బ్యాంకు వ్యవహారాల్లో మెళుకువ వహించండి. కాంట్రాక్టర్లకు కొత్త పనులు చేపట్టే విషయంలో పునరాలోచన అవసరం.
 
మీనం: దంపతుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. ఉపాధ్యాయులు, ఉద్యోగస్తులకు ఒత్తడి, పనిభారం అధికం. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సామాన్య ఫలితాలనే ఇస్తాయి. కీలకమైన వ్యవహారాల్లో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. ఏ వ్యక్తినీ అతిగా విశ్వసించటం మంచిది కాదని గమనించండి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు