07-08-2020 శుక్రవారం రాశిఫలాలు - లక్ష్మీదేవిని పూజించి అర్చిస్తే శుభం

శుక్రవారం, 7 ఆగస్టు 2020 (05:00 IST)
మేషం : గృహంలో ఏదైనా వస్తువు పోవడానికి ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. స్థిరాస్తి అమ్మకానికై చేయుయత్నం విరమించుకోవడం మంచిది. ప్రింటింగ్, స్టేషనరీ వారికి అధికమైన శ్రమ, పనిలో ఒత్తిడి. చికాకులను ఎదుర్కొంటారు. సొంతంగా వ్యాపారం లేక ఏదైనా సంస్థ నెలకొల్పలనే ఆలోచన స్ఫురిస్తుంది. 
 
వృషభం : వస్త్ర, బంగారం, వెండి, లోహ వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. సోదరీ, సోదరులతో సంబంధ, బాంధవ్యాలు బాగుగా ఉంటాయి. రాజకీయ నాయకులకు దూర ప్రయాణాలలో మెళకువ అవసరం. ఖర్చులు పెరిగినా ఇబ్బందులు పెద్దగా ఉండవు. స్త్రీలతో సంభాషించేటపుడు సంయమనం పాటించండి. 
 
మిథునం : మీ ఆలోచనా దృష్టిని మరికాస్త పెంపొందించుకోండి. పనిచేసే చోట చిన్నతగాదా జరగవచ్చు. చదువుకు సంబంధించిన విషయాలు మిమ్మల్ని ఒత్తిడికి గురిచేయవచ్చు. వ్యాపారాభివృద్ధి, విస్తరణల కోసం చేసే యత్నాలు క్రమంగా సత్ఫలితాలనిస్తాయి. హోటల్, తినుబండ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. 
 
కర్కాటకం : సిమెంట్, కలప, ఐరన్, ఇటుక వ్యాపారులకు మిశ్రమ ఫలితం. వాహనం ఇతరులకిచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఖర్చులు మీ స్థోమతకు తగినట్టుగానే ఉంటాయి. ప్రియతములిచ్చే సలహా మీకెంతో సంతృప్తినిస్తుంది. ప్రైవేటు, పత్రికా సంస్థలలోని వారికి, రిప్రజెంటేటివ్‌లకు ఒత్తిడి, పనిభారం సమస్యలు తప్పవు. 
 
సింహం : ప్రత్తి, పొగాకు, చెరకు రైతులకు, స్టాకిస్టులకు అనుకూలమైన కాలం. ఒకానొక సమయంలో చేతిలో ధనం లేక బాగా అవస్థపడతారు. దూరదేశాలు వెళ్లడానికి చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులకు బరువు, బాధ్యతలు అధికం. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్ల తీరు ఆందోళన కలిగిస్తుంది. బంధువులను కలుసుకుంటారు. 
 
కన్య : ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారికి పని ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. మీ మనోభావాలు బయటకు వ్యక్తం చేయడం వల్ల అశాంతికి లోనవుతారు. విద్యా, సాంస్కృతిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉమ్మడి ఆర్థిక లావాదేవీల్లో మాటపడాల్సి వస్తుంది. మీ ఆలస్యం, అశ్రద్ధ వల్ల కొన్ని సమస్యలను ఎదుర్కొనక తప్పదు. 
 
తుల : వస్త్ర, బంగారు, వెండి, లోహ వ్యాపారస్తులకు పనివారలతో చికాకులు తప్పవు. విద్యార్థులకు దూర ప్రాంతాలలో ఉన్నత విద్యకై అవకాశాలు లభిస్తాయి. మీ మేలు పొందినవారే మిమ్మల్ని వ్యతిరేకిస్తారు. భార్యాభర్తల మధ్య కలహాలు, పట్టింపులు అధికమవుతాయి. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. 
 
వృశ్చికం : మీ ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచడం క్షేమదాయకం. ఖర్చులు చెల్లింపులు అధికంగా ఉంటాయి. ప్రముఖులతో పరిచయాలు మీ ఉన్నతికి తోడ్పడుతాయి. దైవకార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగాభివృద్ధికి కోసం చేసే యత్నం ఫలిస్తుంది. స్త్రీలకు విలాసాలు, అలంకారాల పట్ల ఆసక్తి అధికమవుతుంది.
 
ధనస్సు : స్త్రీలకు పనివారలతో ఒత్తిడులను, చికాకులను ఎదుర్కొంటారు. అనుకోని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. నూతన పరిచయాలు మీ అభివృద్ధికి దోహదపడతాయి. సహచరుల సహకారం వల్ల రాజకీయాలలోనివారికి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. 
 
మకరం : భాగస్వామిక చర్చలు ప్రశాంతంగా ముగుస్తాయి. ఇప్పటివరకు వాయిదాపడుతూ వస్తున్న పనులు పునఃప్రారంభమవుతాయి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. చేపట్టిన పనులలో చిన్నచిన్న పొరపాట్లు జరిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలకు సంబంధించిన లేఖలు అందుతాయి. 
 
కుంభం : రావలసిన బకాయిలు సకాలంలో అందినా ధనం ఏమాత్రం నిల్వచేయలేకపోతారు. పాత మిత్రుల కలయిక మీకు ఎంతో సంతృప్తినిస్తుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి. ఆడిట్, అకౌంట్స్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. కొంతమంది ముఖ్యమైన విషయాలలో మిమ్మల్ని సంప్రదిస్తారు. 
 
మీనం : బ్యాంకింగ్ రంగాల వారికి మెళకువ అవసరం. కళత్ర మొండివైఖరి మీకు చికాకును కలిగిస్తుంది. రాజకీయ నాయకులకు పదవి సమస్యలు అధికమవుతాయి. మీ సంతానం చదువులో రాణిస్తారు. ఉన్నతాధికారులకు తనిఖీలు, పర్యవేక్షణలో ఏకాగ్రత ముఖ్యం. సాహసించి మీరు తీసుకున్న నిర్ణయం మంచి ఫలితాలనిస్తుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు