మేషం: కుటుంబ సమేతంగా దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. పత్రిగా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షలు నిరుత్సాహపరుస్తాయి. ఆకస్మికంగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వ్యాపారాభివృద్ధికి చేయు ప్రయత్నాలలో సఫలీకృతులవుతారు.
వృషభం: ఏ యత్నం కలిసిరాక పోవడంతో నిరుత్సాహం చెందుతారు. ఫ్యాన్సీ, స్టేషనరీ, వస్త్ర వ్యాపారులకు కలిసిరాగలదు కార్యదీక్షతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. మీరు చేయదల్చుకున్న ముఖ్యమైన పనులు అనుకున్న విధంగా సాగవు.
మిధునం: మీ ఉన్నతిని చాటుకోవడం కోసం ధనం విరివిగా ఖర్చుచేస్తారు. విజ్ఞతాయుతంగా వ్యవహరించి మీ గౌరవాన్ని కాపాడుకోండి. నిరుద్యోగులు ఇంటర్వ్వూల్లో విజయం సాధిస్తారు. విలువైన కానుకలు ఇచ్చి మీ శ్రీమతిని ప్రసన్నం చేసుకుంటారు. ఆప్తుల రాకతో మానసికంగా కుదుటపడుతారు.
కర్కాటకం: ఆర్థిక ఒడిదుకులు తలెత్తిన సమసిపోగలవు. ఎంతటి క్లిష్ట సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కుంటారు. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో నూతన పరిచయాలేర్పడుతాయి. ఇతరులకు సహాయం అర్ధించడానికి మెుహమ్మాటం అడ్డు వస్తుంది. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి సామాన్యం.
సింహం: నూతన వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఒత్తిడి తప్పదు. క్రయవిక్రయాలు లాభసాటిగా ఉంటాయి. ఓరిమితో ప్రయత్నిస్తే సులభంగా లక్ష్యాలు సాధిస్తారు. దైవ, సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. ప్లీడరు, ప్లీడరు గుమస్తాలు వృత్తిపరమైన చికాకులను ఎదుర్కుంటారు.
కన్య: చిన్నారుల, విద్య, ఖరీదైన వస్తువుల కొనుగోలు విషయాలో ఖర్చులు అంచనాలు మించుతాయి. కాంట్రాక్టర్లకు చేతిలో పని పూర్తి కావడంతో ఒకింత కుదుటపడుతారు. స్త్రీల ఆరోగ్యం క్రమేణా మెరుగుపడుతుంది. విద్యార్థులు ఉన్నత చదువుల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళవలసి ఉంటుంది. నూతన రుణాల కోసం అన్వేషిస్తారు.
తుల: ఇంట్లో మార్పులు చేర్పు అసౌకర్యం కలిగిస్తాయి. వాహన చోదకులు జరిమానాలు చెల్లించవలసి వస్తుంది. విదేశీయ వస్తువుల పట్ల ఆకర్షితులవుతారు. బంధుమిత్రుల కలయిక మీకెంతో సంతృప్తి నిస్తుంది. వాగ్వివాదాలకు సరైన సమయం కాదని గమనించండి. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు.
వృశ్చికం: ఉద్యోగ, వ్యాపారులకు అధికారుల నుండి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించే వారుండరు. హోటల్, క్యాటరింగ్ రంగాల్లో వారు పనివారలతో ఇబ్బందులు ఎదుర్కుంటారు. చేపట్టిన పనులు విసుగు కలిగించినా మెుండిగా పూర్తి చేస్తారు. హామీలు, చెక్కుల జారీల్లో ఏకాగ్రత వహించండి.
ధనస్సు: స్త్రీల పట్టుదల వలన కుటుంబ సౌఖ్యం అంతగా ఉండదు. వాతావరణంలో మార్పులు ఎంతో ఆందోళన కలిగిస్తాయి. నిరుద్యోగులు ఇంటర్వ్యూల్లో రాణిస్తారు. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది. బ్యాంకు వ్యవహారాలలో ప్రయాణాలలో మెళకువ అవసరం. దైవ దర్శనాలకై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి.
మకరం: తాపీ పనివారికి ఆందోళనలు తప్పవు. స్త్రీలకు టి. వి ఛానెళ్ళ నుండి ఆహ్వానాలు, సమాచారం అందుతుంది. మీ ప్రమేయం లేకుండానే కొన్ని చిక్కు సమస్యలు పరిష్కారమవుతాయి. తల, కాళ్లు, చేతులు, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. విద్యార్థులకు విశ్రాంతి లోపం వలన ఆరోగ్యం మందగిస్తుంది.
కుంభం: మీ నిజాయితీపై అందరికి నమ్మకం కలుగుతుంది. బంధువులతో సంబంధాలు బలపడుతాయి. విద్యార్థులు ఉపాధ్యాయులతో ఏకీభవించలేకపోతారు. ప్రముఖుల కలయిక వాయిదా పడుతుంది. దైవకార్య సమావేశాల్లో ప్రముఖంగా పాల్గొంటారు. స్త్రీలకు టి. వి ఛానెళ్ళ నుండి ఆహ్వానాలు, సమాచారం అందుతుంది.
మీనం: కొబ్బరి, పండ్లు, పూలు చిరు వ్యాపారులకు లాభదాయకం. మిమ్మల్ని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గ్రహించండి. మిత్రుల నుండి ఒక ముఖ్య సమాచారం అందుకుంటారు. మీ ప్రమేయం లేకుండానే కొన్ని చిక్కు సమస్యలు పరిష్కారమవుతాయి. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో జయం పొందుతారు.