12-07-2020 ఆదివారం రాశిఫలాలు - ప్రేమికులు అతిగా వ్యవహరించి...

ఆదివారం, 12 జులై 2020 (05:00 IST)
మేషం : మీ కుటుంబీకులతో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. సాహస ప్రయత్నాలు విరమించండి. రచయితలు, కళాకారులకు మంచి గుర్తింపు లభిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో గణనీయమైన మార్పులు ఉంటాయి. ప్రచురణ, పత్రికా రంగంలోని వారికి మందకొడిగా ఉండగలదు. పాత బిల్లులు చెల్లిస్తారు. 
 
వృషభం : దైవ, సేవా, పుణ్యకార్యాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. పెద్దల ఆశీస్సులు, ప్రముఖుల ప్రశంసలు పొందుతారు. ఉత్తర ప్రత్యుత్తరాలలో మెళకువ వహించండి. కళా రంగాలకు చెందిన వారు లక్ష్యాలు సాధిస్తారు. స్త్రీలకు పనిభారం అధికం. వాతావరణంలోని మార్పు వ్యవసాయదారులకు ఆందోళన కలిగిస్తుంది. 
 
మిథునం : ఉపాధ్యాయులకు విశ్రాంతి పొందుతారు. దైవ, సేవా, పుణ్యకార్యాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. నూతన దంపతులకు ఎడబాటు, చికాకులు అధికమవుతాయి. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాల్లోనూ, వస్తు నాణ్యతలోనూ మెళకువ అవసరం. కొన్ని వ్యవహారాలు అనుకూలించక పోవడం వల్ల మానసిక ఒత్తిడి లోనవుతారు. 
 
కర్కాటకం : ప్రేమికులు అతిగా వ్యవహరించి చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. నూతన దంపతులకు ఎడబాటు, చికాకులు అధికమించడానికి కొత్త కొత్త పథకాలు రూపొందిస్తారు. వాతారణంలో మార్పుతో స్వల్ప అస్వస్థతకు గురవుతారు. వాయిదాపడిన మొక్కుబడులు తీర్చుకుంటారు. కుటుంబీకులతో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు.
 
సింహం : ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు మంచిది కాదని గమనించండి. వ్యాపారాల్లో నష్టాలను అధికమించడానికి కొత్త కొత్త పథకాలు రూపొందిస్తారు. వాతావరణంలో మార్పుతో స్వల్వ అస్వస్థతకు గురువుతారు. వాయిదాపడిన మొక్కుబడులు తీర్చుకుంటారు. కుటుంబీకులతో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. 
 
కన్య : కానివేళలో ఇతరులరాక ఇబ్బంది కలిగిస్తుంది. స్త్రీల ఉద్యోగయత్నం ఫలిస్తుంది. పాత మొండిబాకీలు వసూలు అవుతాయి. వృత్తులవారికి ఎంత శ్రమించినా ఆదాయం అంతమాత్రంగానే ఉంటుంది. లౌక్యంగా వ్యవహరించి మీ సమాధానాన్ని దాటవేయండి. ఆరోగ్యం విషయంలో చికాకులు ఎదుర్కొంటారు. 
 
తుల : ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి ఉండాల్సి వస్తుంది. కొబ్బరి, పండ్లు, పూలు, చల్లని పానీయ వ్యాపారులకు సామాన్యంగా ఉంటుంది. బంధువుల నుంచి ఒత్తిడి, మొహమ్మాటాలు ఎదుర్కొంటారు. ప్రయాణాల్లో ఒకింత అసౌకర్యానికి లోనవుతారు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. 
 
వృశ్చికం : విద్యార్థుల అత్యుత్సాహం అనర్థాలకు దారితీసే ఆస్కారం ఉంది. వేడుకల్లో చిన్నారులు కీలక పాత్ర పోషిస్తారు. ఎంతో కొంత పొదుపు చేయాలన్న మీ ఆలోచన ఫలించకపోవచ్చు. మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేక అభిమానం కలుగుతుంది. దూరపు బంధువులను కలుసుకుని ఆసక్తికరమైన విషయాలు చర్చిస్తారు. 
 
ధనస్సు : ఇతరులకు పెద్ద మొత్తంలో రుణం ఇచ్చే విషయంలో పునరాలోచన అవసరం. నిరుద్యోగులకు చచేతిదాకా వచ్చిన అవకాశాలు చేజారిపోతాయి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులన ఎదుర్కొంటారు. మత్స్యుకోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకం. మీరు తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు మంచి ఫలితాలినిస్తాయి. 
 
మకరం : యోగ, ధ్యానం, విరామ కాలక్షేపాలు ఊరట కలిగిస్తాయి. సభలు, సమావేశాల్లో చురుకుగా పాల్గొంటారు. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. ఓర్పు, పట్టుదలతో వ్యవహరించి అనుకున్న పనులు సకాలంలో పూర్తిచేస్తారు. క్రయ విక్రయ రంగాల వారికి మెళకువ అవసరం. 
 
కుంభం : రాజకీయ నాయకులకు విదేశీ ప్రయాణాలు, ఉన్నత పదవులపై మైత్రి అధికమవుతుంది. వృత్తి ఉద్యోగ పనులు మధ్యస్తంగా సాగుతాయి. బంధువుల నిష్టూరాలు, పట్టింపులు ఎదుర్కోవలసి వస్తుంది. అనవసరమైన విషయాలలో తలదూర్చి సమస్యలు తెచ్చుకోకండి. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. 
 
మీనం : స్త్రీలు పనివారితో చికాకులను ఎదుర్కొంటారు. రావలసిన ధనం విషయంలో శ్రమాధిక్యత, ప్రయాసలెదుర్కొంటారు. ప్రముఖులను కలుసుకుంటారు. మీ శ్రీమతి ఆరోగ్యం గురించి, ఆందోళన చెందుతారు. ఏ సమస్యలు వచ్చినను సమయోచిత ఆలోచనలు ముఖ్యం. బేకరీ, తినుబండరాలు, పూల వ్యాపారులకు కలిసి వచ్చును. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు