07-07-2020 మంగళవారం రాశిఫలాలు

మంగళవారం, 7 జులై 2020 (05:00 IST)
మేషం : ఉద్యోగస్తులు తరచూ సభలు, యూనియన్ సమావేశాలు, చర్చల్లో పాల్గొంటారు. కళ, క్రీడ, సాంకేతిక రంగాల వారికి ప్రోత్సాహం లభిస్తుంది. బంధువుల నుంచి ఒత్తిడి, మొహమ్మాటాలు ఎదురవుతాయి. స్త్రీలకు స్వీయ అర్జన పట్ల ఆసక్తి, ప్రోత్సాహం లభిస్తాయి. అయినవారు ఆప్తులను కలుసుకుంటారు. 
 
వృషభం : వృత్తులు, క్యాటరింగ్ పనివారలకు సంతృప్తి, పురోభివృద్ధి. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ఒకేసారి అనేక పనుల మీదపడటంతో ఒకింత అసహనానికి గురవుతారు. గృహంలో మార్పులు, చేర్పులు వాయిదాపడాయి. ప్రముఖులకు విలువైన కానుకలందించి వారికి మరింత చేరువఅవుతారు. 
 
మిథునం : రుణ, విదేశీయాన యత్నాల్లో ఆటంకాలెదుర్కొంటారు. కుటుంబ వ్యవహారాలలో కానీ శారీరకంగా, మానసికంగా శ్రమిస్తారు. మీ వ్యవహార జ్ఞానం, సమర్థతలకు మంచి గుర్తింపు లభిస్తుంది. చిన్నతరహా పరిశ్రమలు, కార్మికులకు ఆశాజనకం. కొబ్బరి, పండ్లు, పూల, కూరగాయలు, చిరు వ్యాపారులకు ఆశాజనకం. 
 
కర్కాటకం : మీ గౌరవానికి భంగం కలిగించే సంఘటనలెదురవుతాయి. స్పెక్యులేషన్ రంగాలలో వారికి తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీ అవసరాలకు కావలసిన ధనం సర్దుబాటు చేసుకుంటారు. కోర్టు వ్యవహారాలు వాయిదాపడతాయి. వాహనం విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. 
 
సింహం : అతిగా సంభాషించడం అనర్థదాయకం అని గమనించగలరు. రసాయనిక సుగంధ ద్రవ్యాల వ్యాపారస్తులకు పురోభివృద్ధి కానరాగలదు. దైవ కార్యాల్లో చురుకుగా పాల్గొంటారు. ఉమ్మడి వ్యవహారాలు, ఆస్తి పంపకాలు ఒక కొలిక్కి వచ్చే ఆస్కారం ఉంది. కొత్త వ్యక్తులతో పరిచయాలు మీ ఉన్నతికి దోహదపడతాయి. 
 
కన్య : వ్యవసాయ, తోటల రంగాల వారికి వాతావరణం ఆందోళన కలిగిస్తుంది. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. రాజకీయ నాయకులు వివాదాస్పదమైన వ్యాఖ్యానాలు చేసి ఇబ్బందులను ఎదుర్కొంటారు. స్త్రీలకు విలాస వస్తువులు, అలంకారాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. 
 
తుల : వేళతప్పి ఆహారం భుజించుడం వల్ల ఆరోగ్యంలో ఇబ్బందులు తలెత్తగలవు. స్త్రీల తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బందులకు లోనవుతారు. దైవం మీద చేసే పనిమీద ధ్యాస, ధ్యేయం, ఏకాగ్రత వహించండి. ప్రైవేటు సంస్థలలోని వారికి ఓర్పు, అంకితభావం ముఖ్యం. రుణదారుల నుంచి ఒత్తిళ్లు అధికమవుతాయి. 
 
వృశ్చికం : కంప్యూటర్, ఎలక్ట్రికల్ రంగాలలో వారికి పనివారితో సమస్యలు తలెత్తగలవు. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో మెళకువ అవసరం. విద్యార్థినులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. ఎదుటివారిని బాగుగా గౌరవిస్తారు. మీ ఉన్నత స్థితిని చూసి ఓర్వలేనివారు అధికమవుతున్నారని గమనించండి. 
 
ధనస్సు : బంధు మిత్రుల గురించి మంచి, మంచి పథకాలు వేస్తారు. విద్యార్థులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇబ్బందులకు లోనవుతారు. మతపరమైన విషయాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. చర్మానికి సంబంధించిన చికాకులు, కాళ్లు, ఎముకలు, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. 
 
మకరం : ఆదాయ వ్యయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. ఉద్యోగస్తులు పై అధికారులను తక్కువ అంచనావేసి మాట్లాడటం వల్ల ఇబ్బందులకు లోనవక తప్పదు. సోదరీ, సోదరుల వ్యవహారాల్లో ఊహించని మార్పులు కానరాగలవు. నిరుద్యోగులకు మంచి మంచి అవకాశాలు లభిస్తాయి. స్థిరాస్తుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. 
 
కుంభం : ఉపాధ్యాయులకు విద్యా సంస్థలలోని వారికి ఊహించని సమస్యలు తలెత్తవచ్చును. జాగ్రత్త వహించండి. దూర ప్రయాణాలలో వస్తువుల పట్ల మెళకువ అవసరం. బంధువులను కలుసుకుంటారు. ప్రత్తి, పొగాకు, గోధుమల వ్యాపారస్తులకు సంతృప్తి, అభివృద్ధి కానరాగలదు. మీ ప్రతిభకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. 
 
మీనం : సినిమా, కళా రంగాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు ఉద్దేశ్యపూర్వకంగా ఎవరినీ దూషించకపోయినా ఎదుటివారి అపోహలకు లోనయ్యే అవకాశం ఉంది. ఆత్మీయులను విమర్శించడం మచిందికాదని గమనించండి. సభలు, సమావేశాల్లో చురుకుగా పాల్గొంటారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు