14-05-2020 గురువారం దినఫలాలు - సాయిబాబాను పూజిస్తే...

గురువారం, 14 మే 2020 (05:00 IST)
మేషం : ట్రాన్స్‌పోర్టు, ఆటోమొబైల్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. దుబారా ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి ఉండాల్సివస్తుంది. కోర్టు వ్యవహారాలు మీరు కోరుకున్నట్టుగానే వాయిదాపడతాయి. 
 
వృషభం : ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల వారికి ఒత్తిడి తప్పదు. వీలైనంత వరకు మీ పనులు మీరే చూసుకోవడం ఉత్తమం. పాత వస్తువులను కొని ఇబ్బందులు పడతారు. కపటంలేని మీ ఆలోచనలు, సలహాలు మీకు అభిమానులను సంపాదించి పెడుతుంది. సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. 
 
మిథునం : కిరాణా, ఫ్యాన్సీ, కొబ్బరి, పండ్లు, పూల, కూరగాయల వ్యాపారులకు శుభదాయకం. స్త్రీలు ప్రతి విషయంలో అతిగా వ్యవహరించడం వల్ల మంచిదికాదని గమనించండి. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికం. సమయానుకూలంగా మీరు తీసుకున్న నిర్ణయానికి ప్రముఖుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది. 
 
కర్కాటకం : మీ లక్ష్య సాధనలో స్వల్ప ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో కృషి చేయడం వల్ల సత్ఫలితాలు పొందుతారు. సిమెంట్, కలప, ఐరన్, ఇటుక వ్యాపారులకు మందకొడిగా ఉంటుంది. విద్యార్థినులకు టెక్నికల్, సైన్స్, గణిత కోర్సుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ సమస్యలకు ఒక చక్కని పరిష్కార మార్గం లభిస్తుంది. 
 
సింహం : విద్యార్థులు సన్నిహితుల ద్వారా కొత్త విషయాలు గ్రహిస్తారు. సోదరీ, సోదరుల మధ్య అవగాహన ఏర్పడుతుంది. చేనేత, ఖాదీ వస్త్ర పరిశ్రమల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఎప్పటి సమస్యలు అపుడే పరిష్కరించడం మంచిది. ఒక్కోసారి మీ జీవిత భాగస్వామి మనస్తత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. 
 
కన్య : మిత్రుల కారణంగా సమస్యలు తలెత్తగలవు. రుణదాతలను సంతృప్తి పరుస్తారు. మీ పాత సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి. స్త్రీలకు స్వీయ అర్జన పట్ల ఆసక్తి, అందుకు తగిన ప్రోత్సాహం లభిస్తాయి. విద్యార్థులకు క్రీడలు, ఇతర వ్యాపకాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. 
 
తుల : యాధృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్ర సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. సంఘంలో మంచి గుర్తింపు లభిస్తుంది. పారిశ్రామిక రంగంలో వారికి కార్మికులతో చికాకులు తప్పవు. బంధువుల రాక, ఊహించని ఖర్చులు ఆందోళనలు కలిగిస్తాయి. అధికారుల తీరును గమనించి తదనుగుణంగా వ్యవహరించడం మంచిది. 
 
వృశ్చికం : వ్యాపారాలు, స్థిరచరాస్తుల అభివృద్ధికై చేయు కృషిలో సఫలీకృతులవుతారు. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. ఒకే కాలంలో అనేక పనులు చేయడం వల్ల ఇబ్బందులు తప్పవు. ఉద్యోగ, వ్యాపారులకు అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. మిమ్మల్ని పొగిడేవారే కానీ, సహకరించేవారుండరు. 
 
ధనస్సు : కొన్ని వ్యవహారాలు అనుకూలించినా మరికొన్ని ఆందోళన కలిగిస్తాయి. దూర ప్రయాణాలలో కొత్త వ్యక్తులతో పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. రావలసిన ఆదాయం అందటంతో ఆర్థికంగా ఒకడుగు ముందుకేస్తారు. ఇతరుల గురించి మీరు చేసిన వ్యాఖ్యలు పలు సమస్యలకు దారితీయవచ్చు. 
 
మకరం : బంధువుల రాక అనుకోని ఖర్చుల వల్ల స్వల్ప ఇబ్బందులు తప్పవు. కాంట్రాక్టర్లకు ఒడిదుడుకులు తప్పవు. ప్రైవేటు సంస్థలలోని వారు మార్పులకై చేయు యత్నాలు అనుకూలిస్తాయి. ఎదుటివారిని అతిగా విశ్వసించడం అంత మంచిదికాదని గమనించండి. సంతానం ఉన్నత చదువులపై శ్రద్ధ వహిస్తారు. 
 
కుంభం : మిర్చి, నూనె, వెల్లుల్లి, ధాన్యం, అపరాల స్టాకిస్టులకు, హోల్‍సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. ఆధ్యాత్మిక, ఆరోగ్య విషయాల పట్ల శ్రద్ధాసక్తులు కనబరుస్తారు. బ్యాంకు వ్యవహారాలలో మెళకువ అససరం. ఉద్యోగస్తుల శ్రమకు మంచి గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తాయి. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. 
 
మీనం : నిరుద్యోగులకు దూర ప్రాంతాల నుంచి అవకాశాలు లభిస్తాయి. స్త్రీలు విలువైన వస్తువులు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. వృత్తుల వారికి పురోభివృద్ధి. రిప్రజెంటేటివ్‌లకు, ఉపాధ్యాయులకు, మార్పులు అనుకూలిస్తాయి. ఓర్పు, విజ్ఞతాయుతంగా వ్యవహరించడం వల్ల ఒక వ్యవహారం మీకు సానుకూలమవుతుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు