14-08-2019- బుధవారం మీ రాశి ఫలితాలు.. ఆర్థిక ఇబ్బందులు తలెత్తుట వల్ల?
బుధవారం, 14 ఆగస్టు 2019 (10:27 IST)
మేషం: ఉమ్మడి వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. సన్నిహితుల సలహాను పాటించి ఒక సమస్యను అధికమిస్తారు. ఉపాధ్యాయులకు మానసిక ప్రశాంతత చేకూరుతుంది. హోటల్, క్యాటరింగ్, తినుబండారు వ్యాపారులకు కలసివస్తుంది. మీ అలవాట్లు, మాటతీరు ఇబ్బందులకు దారితీస్తుంది. నిరుద్యోగ యత్నాలు ఫలిస్తాయి.
వృషభం: భాగస్వామిక చర్చలు వాయిదాపడటం మంచిదని గమనించండి. వృత్తుల వారికి శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. కొత్త సమస్యలు తలెత్తె ఆస్కారం ఉంది. స్టాక్ మార్కెట్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. మీ మాటకు సంఘంలోనూ, కుటుంబంలోనూ ఆమోదం లభిస్తుంది.
మిథునం: ఉద్యోగస్తులకు బరువు, బాధ్యతలు అధికమవుతాయి. ఇతరులకు ధన సహాయం చేసే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. వాతావరణంలోని మార్పు ఎంతో ఆందోళన కలిగిస్తుంది. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు ఆలస్యంగా అందుతాయి. రాజకీయ నాయకులకు విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి.
కర్కాటకం: ప్రయాణాలు, బ్యాంకింగ్ వ్యవహారాలలో మెళుకువ అవసరం. ప్రభుత్వ అధికారులకు పనివారితో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఎంతో కొంత పొదుపు చేయాలన్న మీ యత్నం ఫలించదు. స్త్రీలు చొరవగా వ్యవహరించి ఒక సమస్యను సునాయాసంగా పరిష్కరిస్తారు. శత్రువుల సైతం మిత్రులుగా మారి సహకారం అందిస్తారు.
సింహం: మీ సంతానం మొండి వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు వసూలులో శ్రమాధిక్యత, ప్రయాసలు ఎదుర్కొంటారు. మీ సమస్యలను ఆత్మీయులకు చెప్పుకోవటం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఉమ్మడి ఆస్తి విక్రయాల్లో సోదరుల నుంచి అభ్యంతరాలెదుర్కుంటారు.
కన్య: ఆర్థిక ఇబ్బందులు తలెత్తుట వల్ల ఆందోళన చెందుతారు. దూర ప్రయాణాలలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారికి పనిభారం అధికమవుతుంది. బంధువుల రాకతో ఖర్చులు అధికమవుతాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది.
తుల: నిత్యవసర స్టాకిస్తులకు రేషన్ డీలర్లకు చికాకులు అధికమవుతాయి. ఉపాధ్యాయులకు విద్యార్థుల మొండి వైఖరి ఎంతో చికాకు కలిగిస్తుంది. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. పెద్దల ఆరోగ్యములో సంతృప్తి కానవస్తుంది. సంఘంలో మంచి పేరు, ఖ్యాతి గడిస్తారు. స్త్రీలకు పనిభారం అధికమవుతుంది.
వృశ్చికం: ఆర్థికంగా బాగుగా స్థిరపడతారు. బంధుమిత్రుల నుంచి సమస్యలు తలెత్తుతాయి. తలపెట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. హామీల విషయంలో జాగ్రత్త వహించండి. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలేర్పడతాయి. కోర్టు వ్యవహారాలు వాయిదా పడుట మంచిది.
ధనస్సు: ఆదాయానికి తగినట్లుగానే ఖర్చులు ఉంటాయి. సోదరీ సోదరులతో ఏకీభవించలేకపోతారు. అతిధి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. ప్రముఖుల కలియికతో పనులు సానుకూలమవుతాయి. విద్యార్థులు వాహనం నడుపునపుడు మెళుకువ అవసరం. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళుకువ అవసరం.
మకరం: వస్త్ర, ఫాన్సీ, పచారీ వ్యాపారులకు పురోభివృద్ధి పొందుతారు. ఉద్యోగాల్లో కొంత పురోగతి ఉంటుంది. స్త్రీలకు పనిభారం అధికమవుతుంది. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షలో ఏకాగ్రత ముఖ్యం. నూతన టెండర్ల వ్యవహారంలో ఏకాగ్రత, విషయ పరిజ్ఞానం అవసరం. మొండి బాకీలు సైతం వసూలు కాగలవు.
కుంభం: చేపట్టిన పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. ముందుచూపుతో ఆలోచించి మీరు తీసుకున్న నిర్ణయం మంచి ఫలితానిస్తుంది. విద్యార్దులకు మిత్రబృందాలు, వ్యాపకాలు అధికం కాగలవు. ప్రియతములు ఇచ్చే సలహా మీకు ఎంతో సంతృప్తి నిస్తుంది. వాహన చోదకులకు ఊహించని చికాకు లెదుర్కోవలసి వస్తుంది.
మీనం: ఒక కార్యం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేయాల్సి వస్తుంది. కోర్టు వ్యవహారాల్లో ఫలితాలు మీకు అనుకూలంగా ఉంటాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో ఏకాగ్రత ముఖ్యం. స్త్రీలకు బంగారం, నూతనవస్త్రాలపై మక్కువ పెరుగుతుంది. సిమెంటు, కలప, ఐరన్, ఇటుక వ్యాపారులకు ఆశించినంత లాభసాటిగా ఉండదు.