10-08-2019- శనివారం మీ రాశి ఫలితాలు.. భార్యాభర్తల మధ్య?

శనివారం, 10 ఆగస్టు 2019 (10:34 IST)
మేషం: ప్రింటింగ్ రంగాల వారికి చేపట్టిన పనులు ఒక పట్టాన పూర్తికావు. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లు, ప్లీడరు గుమస్తాలకు చికాకులు తప్పవు. రచయితలకు, పత్రికా రంగంలో వారికి ప్రోత్సాహం కానవస్తుంది. మిత్రుల కలయిక, సన్నిహితుల సలహాలు మీలో కొత్త ఉత్సాహం కలిగిస్తాయి. కొత్త రుణాలను అన్వేషిస్తారు. 
 
వృషభం: ఆర్ధిక లావాదేవీలు ఊహించిన విధంగానే ఉంటాయి. వ్యవసాయ రంగలలోని వారికి మెళుకువ అవసరం. ఆలయాలను సందర్శిస్తారు. భాగస్వామికులతో అభిప్రాయభేదాలు తలెత్తుతాయి. ఉద్యోగరీత్యా దూరప్రయాణాలు చేయవలసివస్తుంది. కాంట్రాక్టర్లకు ఇంజనీరింగ్ విభాగాలవారి నుంచి ఒత్తిడి పెరుగుతుంది. 
 
మిథునం: స్త్రీలపై చుట్టుపక్కల వారి మాటల ప్రభావం అధికంగా ఉంటుంది. మీ సంతానం పై చదువుల కోసం బాగా శ్రమిస్తారు. మీ వ్యాఖ్యలను బంధుమిత్రులు అపార్ధం చేసుకుంటారు. వస్త్ర, బంగారం, వెండి, ఫాన్సీ వ్యాపారాల్లో పోటీతత్వం అధికంగా ఉంటుంది. ప్రేమికుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి.
 
కర్కాటకం: ప్రముఖుల సహకారంతో ఒక సమస్య నుంచి గట్టెక్కుతారు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. క్రయ విక్రయాలు సామాన్యంగా ఉంటాయి. కుటుంబీకుల మధ్య ఆసక్తికరమైన విషయాలు చర్చకు వస్తాయి. వ్యాపారంలో పెరిగిన పోటీ ఆందోళన కలిగిస్తుంది. ఖర్చలు ప్రయోజనకరంగా ఉంటాయి.
 
సింహం: గృహ నిర్మాణాలు, శంకుస్థాపనలు వాయిదా వేయటం మంచిది. చేతి వృత్తుల వారికి లాభదాయకం. బ్యాంకింగ్ వ్యవహారాలలోను, ప్రయాణాలలోను అపరిచిత వ్యక్తుల పట్ల మెళుకువ అవసరం. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మారి సహాయం అందిస్తారు.
 
కన్య: పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలించవు. స్త్రీలకు తల, నరాలు, ఎముకులకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. ఒక వ్యవహారం నిమిత్తం ప్లీడర్లతో సంప్రదింపులు జరుపుతారు. స్థిరాస్తిని అమర్చుకోవలనే ఆలోచన స్ఫురిస్తుంది. నూతన దంపతుల మధ్య కొత్త కొత్త ఆలోచనలు తలెత్తుతాయి.
 
తుల: వస్త్ర, బంగారం, వెండి, ఫాన్సీ వ్యాపారాల్లో పోటీతత్వం అధికంగా ఉంటుంది. అరుదైన శస్త్రచికిత్సలను డాక్టర్లు విజయవంతంగా పూర్తి చేస్తారు. వస్తువులను అమర్చుకుంటారు. నిరుద్యోగులు నిరుత్సాహం వీడి శ్రమించిన సత్ఫలితాలు లభిస్తాయి. కొంత మంది మీ నుంచి ధనం లేక ఇతరత్రా సహాయం అర్థిస్తారు.
 
వృశ్చికం: అర్థాంతంగా నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. మిత్రుల కలయికతో గత కాలం జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. ఉద్యోగస్తులకు, ఉపాధ్యాయులకు బరువు, బాధ్యతలు అధకమవుతాయి. రుణ దాతల నుంచి ఒత్తిడి అధికమవుతుంది. హామీలు, చెక్కుల జారీల్లో ఏకాగ్రత వహించండి. వ్యవహార సానుకూలతకు బాగా శ్రమిస్తారు.
 
ధనస్సు: ఆర్ధిక విషయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. స్త్రీల మాటకు కుటుంబంలో మంచి స్పందన లభిస్తుంది. ప్రముఖుల కలయిక వల్ల ఆశించిన మేలు పొందుతారు. ఉద్యోగస్తులకు తోటివారి సహాయాన్ని పొందుతారు. నూతన వస్తువులు అమర్చుకుంటారు. విద్యర్థులకు కొత్త కొత్త విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. 
 
మకరం: భార్య, భర్తల మధ్య సఖ్యత నెలకొంటుంటుంది. మిత్రుల తీరు నిరుత్సాహం కలిగిస్తుంది. కీలకమైన సమావేశాల్లో మితంగా సంభాషించండి. ఒంటెత్తు పోకడ మంచిది కాదని గమనించండి. పారిశ్రామిక రంగంలోని వారు కార్మికులతో ఒప్పందం కుదుర్చుకుంటారు. రుణ, ఇతర వాయిదాలు సకాలంలో చెల్లిస్తారు. 
 
కుంభం: కాంట్రాక్టర్లకు ఇంజనీరింగ్ రంగాల వారి నుంచి ఒత్తిడి పెరుగుతుంది. స్థిరాస్తి వ్యవహారాలు, కుటుంబ సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. ప్రేమికులకు చికాకులు అధికం. ఆత్మీయుల గురించి ప్రియమైన వార్తలు వినవలసివస్తుంది. గత తప్పిదాలు పునరావృతం కాకుండా తగు జాగ్రత్త తీసుకోండి. 
 
మీనం: కుటుంబంలో ప్రశాంతత, బంధువులతో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. రావలసిన ధనం వసూలు కోసం బాగా శ్రమిస్తారు. నూతన పెట్టుబడులు పెట్టునపుడు పునరాలోచన అవసరం. విదేశీయానం కోసం చేస్తున్న యత్నాలు ఫలిస్తాయి. స్త్రీలకు పనివారితో ఇబ్బందులు తప్పవు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు