17-03-2019 ఆదివారం దినఫలాలు - వృషభ రాశివారికి...

ఆదివారం, 17 మార్చి 2019 (09:36 IST)
మేషం: ఆర్థిక విషయాల్లో ముందుచూపు అవసరమని గమనించండి. అపరిచిత వ్యక్తులతో మితంగా సంభాషించడం ఉత్తమం. స్త్రీలకు అలంకారాలు, విలాస వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది. ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. ఆలయాలను సందర్శిస్తారు. సోదరులతో ఏకీభవించలేకపోతారు.
 
వృషభం: రాజకీయనాయకులు సభాసమావేశాలలో ఆచితూచి మాట్లాడడం శ్రేయస్కరం. రావలసిన ధనంలో కొంత మొత్తం అందుకుంటారు. ఉద్యోగస్తులు పెండింగ్ పనులపై దృష్టి సారిస్తారు. హోటల్, క్యాటరింగ్ రంగాల్లోవారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కుంటారు. కుటుంబీకులతో ఏకీభవించలేకపోతారు.
 
మిధునం: శత్రువులు మిత్రులుగా మారి సహాయం అందిస్తారు. స్థిరాస్తి అమ్మకం వాయిదా పడడం మంచిది. విదేశీయ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థినుల ఆలోచనులు పక్కదారి పట్టే ఆస్కారం ఉంది. గృహంలో మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. మీ మనోభావాలకు మంచి స్పురణ లభిస్తుంది.
 
కర్కాటకం: ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కొన్న నెమ్మదిగా సమసిపోతాయి. పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాల్లో వారికి పురోభివృద్ధి కానవస్తుంది. ఉపాధ్యాయులతో విద్యార్థులు ఏకీభవించలేకపోతారు. రవాణా రంగాల వారికి ఏకాగ్రత అవసరం. మీ ఏమరుపాటుతనం వలన విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం ఉంది.
 
సింహం: నిరుద్యోగులకు బోగస్ ప్రకటనలు, అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. కొన్ని సమస్యలు మీ గౌరవ ప్రతిష్టలకు సవాలుగా నిలుస్తాయి. హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండడం మంచిది. తరచు అధికారులు, నేతలతో సంప్రదింపులు జరుపుతారు.
 
కన్య: బంధువులరాక అందరికీ సంతోషం కలిగిస్తుంది. ఒక స్థిరాస్తి కొనుగోలు దిశగా మీ ఆలోచనలుంటాయి. మీ శ్రీమతి సలహా పాటించడం వలన మేలు జరిగే అవకాశం ఉంది. ఉద్యోగ బాధ్యతలు పెరగటంతో పాటు పనిభారం అధికమవుతుంది. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి కనబరుస్తారు. 
 
తుల: వాహనచోదకులకు ఏకాగ్రత ముఖ్యం. ఉపాధ్యాయులకు విద్యార్థుల వలన సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి. కొన్ని సమస్యలు అప్రయత్నంగానే పరిష్కారమవుతాయి. ఖర్చులు అధికమైనా భారమనిపించవు. కాంట్రాక్టర్లు, బిల్డర్లకు నిర్మాణ పనుల్లో ఒత్తిడి, సమస్యలు తప్పవు.
 
వృశ్చికం: ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయు యత్నాలు అనుకూలిస్తాయి. ప్రముఖులను కలుసుకుంటారు. భాగస్వామిక సమావేశాలు ప్రశాంతంగా సాగుతాయి. కొత్త వ్యక్తులను అతిగా నమ్మడం మంచిది కాదు. అలంకరణలు, విలాస వస్తువుల పట్ల స్త్రీలు ఆకర్షితులవుతారు. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి.
 
ధనస్సు: ఒక స్థిరాస్తి కొనుగోలు దిశగా మీ ఆలోచనలుంటాయి. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు. స్పెక్యులేషన్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. ప్రైవేటు సంస్థల్లోని వారికి మార్పులు అనుకూలం. వృత్తులు, క్యాటరింగ్ పనివారలకు పురోభివృద్ధి. ఏ క్షణమైనా విపత్కర పరిస్థితులు ఎదురయ్యే సూచనలున్నాయి. 
 
మకరం: మత్స్య, కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. క్రయవిక్రయాలు ఊపందుకుంటాయి. అవివాహితుల్లో నూతన ఉత్సాహం చోటుచేసుకుంటుంది. కంప్యూటర్, ఆడిట్, అక్కౌంట్స్ రంగాలవారికి చికాకులు, పనిభారం అధికం. ప్రేమికులకు పెద్దల నుండి వ్యతిరేకత, ఇతరత్రా చికాకులు అధికం. 
 
కుంభం: కార్యసాధనలో జయం పొంది ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు. మీ సంతానం పై చదువుల కోసం భవిష్యత్ ప్రణాళికలు రూపొందిస్తారు. స్త్రీలకు పనివారితో ఇబ్బందులు తప్పవు. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. విద్యార్థులకు పోటీ పరీక్షల ఒత్తిడి, విశ్రాంతి లోపం వంటి చికాకులు అధికమవుతాయి. 
 
మీనం: సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులను కలుసుకుంటారు. స్త్రీలకు అయిన వారి నుండి వస్త్ర, వస్తు, ధనలాభం వంటి శుభ ఫలితాలున్నాయి. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. బంధువుల నుండి అందిన ఆహ్వానం మిమ్ములను సందిగ్ధానికి గురిచేస్తుంది. గృహ నిర్మాణాలు, ఉపాధి పథకాలకు అనుకూలం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు