18-05-2020 సోమవారం దినఫలాలు - ఈశ్వర పూజ చేయడం వల్ల..

సోమవారం, 18 మే 2020 (05:00 IST)
మేషం : వైద్యులకు ఆపరేషన్లు చేయునపుడు ఏకాగ్రత అవసరం. గృహ మార్పుతో ఇబ్బందులు తొలగి మానసికంగా కుదుటపడతారు. ఉద్యోగస్తులకు అధికారులతో పర్యటనలు, అదనపు బాధ్యతలు స్వీకరించవలసి వస్తుంది. దూర ప్రాయాణాలలో వస్తువుల పట్ల మెళకువ అవసరం. కష్ట సమయంలో బంధువులు అండగా నిలుస్తారు. 
 
వృషభం : బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. పోస్టల్, ఎల్ఐసీ ఏజెంట్లకు ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది. సినిమా, సాంస్కృతిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఖర్చులు అధికం కావడం వల్ల స్వల్ప ఇబ్బందులు తప్పవు. 
 
మిథునం : ఆర్థికంగా బాగుగా స్థిరపడతారు. మిత్రులపై మీరు పెట్టుకున్న ఆశలు, అడియాసలయ్యే సూచనలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో ఓర్పు, ఏకాగ్రత ఎంతో ముఖ్యం. వ్యాపారాభివృద్ధికి చేసే కృషిలో బాగా రాణిస్తారు. సోదరీ, సోదురులతో ఏకీభవించలేకపోతారు. పెద్దల ఆరోగ్యంలో మెళకువ అవసరం. 
 
కర్కాటకం : మీ అవసరాలకు తాకట్టుపెడతారు. బంధువుల తాకిడి పెరుగుతుంది. మీ పనులు వ్యవహారాలు మీరే స్వయంగా నిర్వహించుకోవడం మంచిది. దైవ, సేవా కార్యక్రమాలలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. అర్థాంతరంగా నిలిచిపోయిన పనులు పునఃప్రారంభిస్తారు. పెద్దల ఆరోగ్యంలో మెళకువ అవసరం. 
 
సింహ : కోర్టు వ్యవహారాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. నూతన వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి. వృత్తి పరంగా ఎదురైనా సమస్యలు తొలగిపోతాయి. విదేశీ వ్యవహారాల రంగాలకు చెందిన వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ఒత్తిడి ఎదురవుతుంది. 
 
కన్య : వ్యాపారాల్లో సంతృప్తికరమైన లాభాలు, అనుభవం గడిస్తారు. లాయర్లకు, వైద్యులకు మందకొడిగా ఉంటుంది. ఏదైనా ఆకస్మికంగా అమ్మే అవకాశం ఉంది. ఎలక్ట్రానికి వస్తువుల పట్ల ఆకర్షితులవుతారు. కుటుంబ అవసరాలు పెరగడంతో అదనపు సంపాదన దిశగా ఆలోచనలు చేస్తారు. డిపాజిట్ల సొమ్ము చేతికందుతుంది. 
 
 
తుల : రావలసిన ధనం వసూలులో కొంతమేరకు చేతికందుతుంది. నిరుద్యోగులకు ఉపాధి పథకాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. స్త్రీలు ప్రముఖుల సిఫార్సుతో దైవదర్శనాలను త్వరగా ముగించుకుంటారు. ఉమ్మడి వ్యాపారాల పట్ల ఏకాగ్రత చాలా అవసరం. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. 
 
వృశ్చికం : స్త్రీలకు సంపాదనపట్ల ఆసక్తి పెరుగుతుంది. ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించడం క్షేమదాయకం. విదేశీయానం నిమిత్తం చేసే యత్నాలు ఒక కొలిక్కివస్తాయి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాలవారికి అధికపనిభారం వల్ల చికాకులను ఎదుర్కొంటారు. ప్రభుత్వ కార్యాలయాలలోని పనులు వాయిదపడతాయి. 
 
ధనస్సు : ఓ చిన్న విహార యాత్ర చేస్తారు. దూరపు బంధువులను కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. సంఘంలో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఇతరులతో వీలైనత క్లుప్తంగా సంభాషించడం శ్రేయస్కరం. వైద్య, ఇంజనీరింగ్ రంగంలో వారికి మెళకువ అససరం. 
 
మకరం : ఆర్థిక లావాదేవీలు, కీలకమైన సమస్యలు సమర్థవంతంగా పరిష్కరిస్తారు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాలలో వారికి సదావకాశాలు లభిస్తాయి. కొన్ని పనులు చివరిలో వాయిదావేస్తారు. ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. బంధు వర్గాల నుంచి విమర్శలు మాటపట్టింపులు ఎదురయ్యే ఆస్కారం ఉంది. మెళకువ వహించండి. 
 
కుంభం : పారిశ్రామిక రంగలో వారికి విద్యుత్ లోపం, కార్మిక సమస్యల వల్ల ఇబ్బందులకు లోనవుతారు. ప్రయాణాల, బ్యాంకు లావాదేవీల్లో జాగ్రత్త అవసరం. తలపెట్టిన పనుల్లో సమస్యలు తలెత్తినా తెలివితో పరిష్కరిస్తారు. మీ శ్రీమతి కోరికలు, అవసరాలు తీర్చగలుగుతారు. మీ రాక బంధువులకు ఆనందాన్నిస్తుంది. 
 
మీనం : భాగస్వామిక సమావేశాల్లో మీ నిర్ణయాలను స్పష్టంగా వ్యక్తం చేయండి. ఇతరుల ముందు మీ కుటుంబ సమస్యలు ఏకరవు పెట్టడం మంచిదికాదని గ్రహించండి. మీ శ్రీమతి సూటిపోటి మాటలు మొండితనం చికాకు కలిగిస్తాయి. ముఖ్యంగా, ప్రింట్ మీడియాలో ఉన్నవాళ్లు జాగ్రత్తగా ఉండాలి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు