19-08-2019- సోమవారం మీ రాశి ఫలితాలు

సోమవారం, 19 ఆగస్టు 2019 (09:04 IST)
మేషం: సంఘంలో వైద్య రంగాల వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. రాజకీయాలలో వారికి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ప్లీడర్లకు గుమాస్తాలు, క్లయింట్‌ల విషయంలోను చికాకులను ఎదుర్కొంటారు. పాత బాకీలు వసూలు చేయడం వల్ల ఆర్ధిక ఇబ్బంది తొలగుతుంది. అధిక కృషి చేసి సత్ఫలితాలు పొందండి.
 
వృషభం: లాయర్లకు, ఆడిటర్లకు, డాక్టర్లకు శుభప్రదంగా వుండగలదు. స్త్రీల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. ధనం మంచి నీళ్ళ ప్రాయంగా ఖర్చవుతుంది. ఫ్యాన్సీ, కిరాణా, మందులు, ఎరువులు, రసాయనిక, సుగంధ ద్రవ్య వ్యాపారస్తులకు పురోభివృద్ధి కానవస్తుంది. మీ సంతానం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. 
 
మిధునం: పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాలలో వారికి పనిలో ఒత్తడి, చికాకులు తప్పవు. స్త్రీలతో సంభాషించునపుడు సంయమనం పాటించండి. నూతన పెట్టుబడులకు శ్రీకారం చుడతారు. కళల పట్ల క్రీడల పట్ల ఆసక్తి పెరుగును. ఆదాయానికి మించి ఖర్చులు ఉన్నా సంతృప్తి, ప్రయోజనకరంగా ఉంటాయి.
 
కర్కాటకం: ఒక వ్యవహారం నిమిత్తం తరచు ప్రయాణం చేయవలసివస్తుంది. ట్రాన్స్‌పోర్టు, ట్రావెలింగ్ రంగాల వారికి ఆశాజనకం. బంధువులు, సోదురుల మధ్య ఆత్మీయతలు నెలకొంటాయి. వృత్తుల వారి శ్రమకు తగిన ప్రతిఫలం దక్కుతుంది. పాత రుణాలు తీర్చడంతో పాటు విలువైన పరికరాలు అమర్చుకుంటారు.
 
సింహం: ఆర్థికంగా పురోభివృద్ధి సాధించే యత్నాలు అనుకూలిస్తాయి. ప్లీడర్లకు, ప్లీడరు గుమస్తాలకు పురోభివృద్ధి. ఖర్చులు అధికం. నిరుద్యోగులకు నూతనోత్సాహం చోటు చేసుకుంటుంది. సొంతంగా వ్యాపారం చేయాలన్న మీ ఆలోచన కార్యరూపం దాల్చుతుంది. స్త్రీలకు ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయి.
 
కన్య: ఫైనాన్సు, బ్యాంకింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం తప్పదు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. బిల్లులు చెల్లిస్తారు. ఉద్యోగస్తులు శక్తి వంచన లేకుండా అధికారులను మెప్పిస్తారు. దంపతుల మధ్య కలహాలు తలెత్తుతాయి. గృహమునకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు.
 
తుల: గృహోపకరణాలు సమకూర్చుకుంటారు. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. స్త్రీలకు అపరిచిత వ్యక్తుల పట్ల మెళుకువ అవసరం. పాత మిత్రుల కలయికతో మీకెంతో సంతృప్తినిస్తుంది. సన్నిహితులతో ముఖ్యమైన చర్చల్లో పాల్గొంటారు. కొబ్బరి, కూరలు, పండ్లు, పూల వ్యాపారస్తులకు సంతృప్తికరంగా ఉంటుంది.
 
వృశ్చికం: మీరు చేసిన పనికి ప్రత్యుపకారం పొందుతారు. ఉద్యోగస్తులు ఇతర వ్యాపకాలు విడనాడి విధినిర్వహణలో అప్రమత్తంగా వ్యవహరించవలసి ఉంటుంది. విద్యార్థులు వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. మిమ్మల్ని పొగిడే వ్యక్తులకు దూరంగా ఉండండి. ఖర్చులు మీ రాబడికి మించటం వల్ల స్వల్ప ఒడిదుడుకులు తప్పవు. 
 
ధనస్సు: కుటుంబ పరిస్థితుల క్రమేణా మెరుగుపడతాయి. కోర్టు వ్యవహారాలు వాయిదా పడుట మంచిది. ప్రయాణాలలో వస్తువుల పట్ల మెళుకువ అవసరం. కిరణా, ఫ్యాన్సీ, మందులు, పానీయ, ఆల్కహాలు వ్యాపారస్తులకు పురోభివృద్ధి కానవస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు నూతన ఆలోచనలు స్పురిస్తాయి.
 
మకరం: బ్యాంకింగ్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళుకువ అవసరం. ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు. విదేశీ యత్నాల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కుంటారు. ఆలయాలను సందర్శిస్తారు. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉపాధ్యాయులకు విద్యార్థుల నుండు ఒత్తడి, చికాకులను ఎదుర్కుంటారు.
 
కుంభం: వస్త్ర, బంగారు, వెండి రంగాలలో వారికి అనుకూలమైన కాలం. వాహనం అమర్చుకోవాలనే మీ కోరిక ఫలిస్తుంది. నూతన పెట్టుబడులు పెట్టునపుడు మెళుకువ అవసరం. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. నియమాలకు కట్టుబడి ఉండుటవలన నిర్ణయాలు తీసుకోలేకపోతారు.
 
మీనం: ప్రైవేటు సంస్థల్లో వారు మార్పునకై చేయు ప్రయత్నాలు వాయిదా పడతాయి. ఉద్యోగస్తుల శ్రమకు, అధికారుల నుండి ప్రసంశలు లభిస్తాయి. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. రావలసిన పత్రాలు చేతి కందుతాయి. స్త్రీలకు బంధువర్గాలతో పట్టింపులు అధికమవుతాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు