21-07-2019 ఆదివారం దినఫలాలు - పెద్దల ఆశీస్సులు...

ఆదివారం, 21 జులై 2019 (10:02 IST)
మేషం: ఉపాధ్యాయులకు విశ్రాంతి లభిస్తుంది. దూరప్రయాణాలలో మెళకువ అవసరం. ఆత్మీయులకు విలువైన బహుమతులు అందిస్తారు. ప్రైవేటు సంస్థలలోని వారికి ఊహించని మార్పులు సంభవిస్తాయి. వీలైనంత వరకూ మీ పనులు మీరే చూసుకోవటం ఉత్తమం. సహోద్యోగులతో కలసి విందు, వినోదాలలో పాల్గొంటారు.
 
వృషభం: ఎదుటి వారితో ముక్తసరిగా సంభాషిస్తారు. పెద్దల ఆశీస్సులు, ప్రముఖుల ప్రశంసలు పొందుతారు. ఇతరుల ముందు వ్యక్తిగత విషయాలు వెల్లడించటం మంచిది కాదని గమనించండి. మత్స్య, కోళ్ళ, గొర్రెల వ్యాపారస్తులకు కలిసిరాగలదు. పాత వస్తువులను కొనుగోలు చేయడం వల్ల ఇబ్బందులు అధికమవుతాయి. 
 
మిథునం: మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవటం శ్రేయస్కరం. రుణాల కోసం అన్వేషిస్తారు. స్త్రీలకు పని భారం అధికమవుతుంది. రహస్య విరోధులు అధికం కావడం వల్ల రాజకీయాల్లో వారికి ఆందోళన తప్పదు. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు పని భారం అధికమవుతుంది.
 
కర్కాటకం: నిరుద్యోగులు బోగస్ ప్రకటనల వల్ల నష్టపోయే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. ప్రముఖుల కలయిక ప్రయెజనకరంగా ఉంటుంది. విద్యార్థులు క్రీడలలో పాల్గొంటారు. మీ సంతానం కోసం ధనం బాగా వ్యయం చేస్తారు. ఒకానొక సందర్భంలో మీ కుటుంబీకుల ధోరణి అసహనం కలిగిస్తుంది.
 
హం: ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. విహారయాత్రల్లో ఉల్లాసంగా గడుపుతారు. స్త్రీలకు పనివారి చికాకులు తప్పవు. దూర ప్రయాణాలలో వస్తువుల పట్ల మెళుకువ అవసరం. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. నూతన పరిచయాలు, వ్యాపకాలు ఏర్పడతాయి.
 
కన్య: తొందరపడి సంభాషించటం వల్ల ఇబ్బందులకు గురికాక తప్పదు. వృత్తి వ్యాపారులకు సామాన్యంగా ఉంటుంది. మీ కుటుంబీకుల మొండివైఖరి చికాకు కలిగిస్తుంది. ఒక ప్రకటన మీకెంతో ఆందోళన కలిగిస్తుంది. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. సోదరీ, సోదరుల మధ్య అనుబంధాలు బలపడతాయి.
 
తుల: పండ్లు, పూలు, కొబ్బరి చిరు వ్యాపారాలకు లాభదాయకంగా ఉంటుంది. సన్నిహితులలో మార్పు మీకెంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. స్త్రీలకు చుట్టుప్రక్కల వారి నుండి సమస్యలు ఎదురవుతాయి. ప్రముఖులను కలిసుకుంటారు. బ్రోకర్లకు, ఏజెంట్లకు, రియల్ఎస్టేట్ వ్యాపారస్తులకు శ్రమకు తగిన ప్రతిఫలం కానవస్తుంది.
 
వృశ్చికం: ట్రాన్సుపోర్టు రంగాల్లో వారికి కార్మికుల వల్ల సమస్యలు తలెత్తుతాయి. స్త్రీలకు పనివారలతో ఇబ్బందులను ఎదుర్కుంటారు. సేవా కార్యక్రమాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. నూనె, మిర్చి, మినుము వ్యాపారస్తులకు స్టాకిస్టులకు అభివృద్ధి కానవస్తుంది. అప్రయత్న ధనలాభములు, వాహనసౌఖ్యం, కుటుంబ సౌఖ్యం పొందుతారు.
 
ధనస్సు: మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. రావలసిన బకాయిలు సకాలంలో అందిన ధనం ఏమాత్రం నిల్వ చేయలేరు. కొన్ని సమస్యలు మబ్బు విడినట్లు విడిపోవును. వృత్తి, వ్యాపారాల యందు అనుకూలత. నిరుద్యోగులకు దూర ప్రాంతాల నుండి అవకాశాలు లభిస్తాయి. ఆలయాలను సందర్శిస్తారు.
 
మకరం: రాజకీయంలో వారికి కార్యకర్తల వల్ల చికాకులు తప్పవు. ఖర్చులు అధికం అగుటవలన ఆందోళనకు గురవుతారు. మీ సంతానం విషయంలో ఏకాగ్రత వహించగలుగుతారు. చేతివృత్తుల వారికి కలిసిరాగలదు. అనవసరపు వివాదాలకు దూరంగా ఉండండి.
 
కుంభం: ఆర్ధిక విషయాల్లో ఒత్తిడి పెరుగుతుంది. ఖర్చులు అధికమవుతాయి. వాహనం కొనుగోలుకై చేయు యత్నాలు వాయిదా పడతాయి. సాంఘిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తులలో వారికి మంచి మంచి అవకాశాలు లభిస్తాయి. ఏజెంట్లకు, బ్రోకర్లకు, రిప్రజెంటేటివ్‌లకు వారిశ్రమకు తగిన ఫలితం లభిస్తుంది.
 
మీనం: భాగస్వామ్యుల మధ్య అవగాహన లోపిస్తుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. రావలసిన ధనం వసూలులో శ్రమాధిక్యత, ప్రయాసలెదుర్కుంటారు. మీ కుటుంబీకుల కోసం మంచి మంచి ప్రణాళికలు వేస్తారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రముఖుల సహకారంతో ఒక సమస్య నుంచి గట్టెక్కుతారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు