25-07-2020 శనివారం రాశిఫలాలు - ఆర్థికంగా ఎదగడానికి మీరు చేసే యత్నాలు

శనివారం, 25 జులై 2020 (05:00 IST)
మేషం : మనుషుల మనస్థత్వం తెలిసి మసలుకొనుట మంచిది. కుటుంబీకుల మొండివైఖరి అసహనం కలిగిస్తుంది. పాత వస్తువులనుకొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. కోర్టు వ్యవహారాలు మీరు కోరుకున్నట్టుగాన వాయిదాపడతాయి. ఖర్చులు పెరిగినా ఇబ్బంది ఉండదు. ఎవరికీ బాధ్యతలు పనులు అప్పగించవద్దు. 
 
వృషభం : పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. బంధువుల కారణంగా మీ కార్యక్రమాలు వాయిదా వేసుకోవలసి వస్తుంది. రవాణా రంగాల వారికి చికాకులు అధికం. ఉమ్మడి వెంచర్లు, పెట్టుబడుల వ్యవహారంలో అనుభవజ్ఞుల సలహా పాటించండి. ఆందోళన కలిగించిన సంఘటన తేలికగా సమసిపోతుంది. 
 
మిథునం : ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత అవసరం. ప్రముఖులకు కానుకలు సమర్పించి ప్రముఖులను ప్రసన్నం చేసుకుంటారు. బ్యాంకింగ్ వ్యవహారాలతో సంభాషించేటపుడు జాగ్రత్త వహించండి. కుటుంబీకుల మొండివైఖరి అసహనం కలిగిస్తుంది. వ్యాపారాల్లో స్వల్ప ఒడిదుడుకుల, చికాకులు ఎదుర్కొంటారు. 
 
కర్కాటకం : షాపింగ్‌లో దుబారా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. శత్రువులు మిత్రులుగా మారి సహయం అందిస్తారు. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. విద్యార్థులు విదేశీ చదువుల కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. సోదరీ, సోదరులతో సంబంధాలు బాంధవ్యాలు బాగుగా ఉంటాయి. 
 
సింహం : మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో ఆందోళన, చికాకు కలిగిస్తుంది. ఆత్మీయుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడం వల్ల శుభం చేకూరగలదు. వాహనచోదకులకు ఊహించని చికాకులు తలెత్తుతాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు నిరుత్సాహపరుస్తాయి. 
 
కన్య : ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. ఫ్లీడర్లకు, ఫ్లీడరు గుమస్తాలకు పురోభివృద్ధి. వస్త్ర, స్టేషనరీ, ఫ్యాన్సీ, చిరు వ్యాపారులకు అన్ని విధాలా కలిసిరాగలదు. విదేశీయానం కోసం చేసే యత్నాలు మందకొడిగా సాగుతాయి. స్త్రీలకు కొత్త కొత్త కోరికలు సరదాలు స్ఫురిస్తాయి. 
 
తుల : భాగస్వామిక, సొంత వ్యాపారాల్లో ఏకాగ్రత అవసరం. ఉపాధ్యాయులకు ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగస్తులకు పైఅధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు తప్పవు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. స్థిరాస్తి కొనుగోలు లేదా అభివృద్ధి దిశగా మీ ఆలోచనలు ఉంటాయి. వైద్య, శాస్త్ర, వాణిజ్య రంగాల వారికి శుభదాకయం. 
 
వృశ్చికం : తలపెట్టిన పనులు త్వరితగతిన పూర్తి చేస్తారు. విద్యార్థుల మొండివైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. బ్యాంకు వ్యవహారాలలో పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించడి. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా వారికి మిశ్రమ ఫలితం. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. 
 
ధనస్సు : స్త్రీలకు పని ఒత్తిడి వల్ల ఆరోగ్యం ఒత్తిడి, చికాకులు తప్పవు. చిన్నారుల ప్రియతముల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. కోర్టు వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. ఇతరుల సాయం కోసం ఎదురు చూడకుండా మీ యత్నాలు సాగించండి. మీరు అభిమానించే వ్యక్తి నుంచి ప్రశంసలు పొందుతారు. 
 
మకరం : చేపట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదురవుతాయి. దైవ, సేవా కార్యక్రమాల కోసం ధనం అధికంగా వెచ్చిస్తారు. ఉద్యోగస్తులు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. ఆదాయ వ్యయాల్లో ప్రమాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. సోదరీ, సోదరుల మధ్య అవగాహన ఏర్పడుతుంది. 
 
కుంభం : ఆర్థిక వ్యవహారాల్లో ఆశించిన ప్రయోజనాలు సాధించడం కష్టం. ఉద్యోగస్తులు ఊహించని అవరోధాలు తలెత్తుతాయి. ఉపాధ్యాయులకు విద్యార్థుల వల్ల సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. రాజకీయ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. 
 
మీనం : ఆర్థికంగా ఎదగడానికి మీరు చేసే యత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. చిన్నారుల విద్య, ఖరీదైన వస్తువుల కొనుగోలు విషయంలో ఖర్చులు అంచనాలను మించుతాయి. ఉద్యోగస్తులు అధికారులను మెప్పించడానికి బాగా శ్రమించాల్సి ఉంటుంది. పత్రికా రంగంలోని వారి ప్రతిభకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు