26-08-2020 బుధవారం దినఫలాలు - సత్యదేవుడిని పూజించి అర్చన చేస్తే... (video)

బుధవారం, 26 ఆగస్టు 2020 (05:00 IST)
మేషం : ధనం ఎంత సంపాదించినా నిలువ చేయలేకపోతారు. ప్రయాణాలు వాయిదాపడతాయి. ఉమ్మడి, సొంత వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. పెద్దల ఆహార, ఆరోగ్య విషయాల్లో మెళకువ వహించండి. కోర్టు వ్యవహారాలు వాయిదాపడతాయి. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. 
 
వృషభం : యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. గతంలో దొర్లిన పొరపాట్లు పునరావృత్తం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం క్షేమదాయకం. మీ సంతానం ఆరోగ్యం, వివాహ విషయాల పట్ల దృష్టిసారిస్తారు. సంఘంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగస్తులు అపరిచిత వ్యక్తుల వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. 
 
మిథునం : స్త్రీలకు స్వీయ సంపాదన పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఒప్పందాలు, కాంట్రాక్టులకు సంబంధించిన విషయాల్లో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. వ్యాపారాలకు కావలసిన పెట్టుబడి సమకూర్చుకుంటారు. పాత రుణాలు తీరుస్తారు. ప్రింటింగ్ రంగాల వారికి అక్షర దోషాల వల్ల చికాకులు తప్పవు. 
 
కర్కాటకం : ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. బంధువులు మీ గురించి చేసిన వ్యాఖ్యలు మనస్తాపం కలిగిస్తాయి. స్త్రీలు అపరిచిత వ్యక్తులకు వీలైనంత దూరంగా ఉండటం శ్రేయస్కరం. దైవ, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. భాగస్వామిక వ్యాపారాల నుంచి విడిపోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. 
 
సింహం : ఓర్పు, పట్టుదలతో శ్రమించి మీరు అనుకున్నది సాధిస్తారు. స్థిరచరాస్తుల క్రయ విక్రయాలు అనుకూలిస్తాయి. వాతావరణంలో మార్పు వల్ల స్త్రీల ఆరోగ్యం మందగిస్తుంది. విద్యార్థుల అనవసర విషయాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. కోర్టు, ఆస్తి పంపకాలకు సంబంధించిన వ్యవహారాలు కొత్త మలుపు తిరుగుతాయి. 
 
కన్య : వస్త్ర, వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తికరంగా సాగుతాయి. కుటుంబ పరిస్థితులు చక్కబడతాయి. మీ కొత్త పథకాలు ఆచరణలో పెట్టి జయం పొందండి. ప్రైవేటు సంస్థలలోని వారు ఓర్పు, అంకితభావంతో పని చేసి గుర్తింపు పొందుతారు. నిరుద్యోగులకు ఉపాధి పథకాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
 
తుల : నిర్మాణ పనులలో కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు ఏకాగ్రత ముఖ్యం. మీ కార్యక్రమాలు మార్చుకోవాలసి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులకు విధి నిర్వహణలో ఇబ్బందులెదురవుతాయి. రావలసిన ధనం అందడంతో పొదుపు దిశగా మీ ఆలోచనలు సాగుతాయి. స్త్రీలకు ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తినా నెమ్మదిగా సమసపోతాయి. 
 
వృశ్చికం : మీ బంధువులను సహాయం అర్థించే బదులు మీరే ప్రత్యామ్నాయం చూసుకోవడం ఉత్తమం. తలపెట్టిన పనులు నిర్విఘ్నంగా పూర్తిచేస్తారు. ఉద్యోగస్తులు చాకచక్యంగా వ్యవహరించి పై అధికారులను ఆకట్టుకుంటారు వైద్య రంగాల వారికి చికాకులు, ఇంజనీరింగ్, శాస్త్ర, సాంకేతిక రంగాల వారికి ఒత్తిడి అధికమవుతాయి. 
 
ధనస్సు : వస్త్ర, బంగారం, వెండి వ్యాపారులకు పనివారలతో చికాకులు తలెత్తుతాయి. కోర్టు వ్యవహారాలు భూ వివాదాలు నిరుత్సాహపరుస్తాయి. పత్రికా రంగంలోని వారికి ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వాహనచోదకులకు ఆటంకాలు తప్పవు. ప్రయాణాలు ఉల్లాసం కలిగిస్తాయి. 
 
మకరం : మీ జీవిత భాగస్వామి వైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. నిరుద్యోగ యత్నాలు కలిసిరాగలవు. విద్యార్థినిలకు లక్ష్యం పట్ల ఏకాగ్రత ఏర్పడుతుంది. ఖర్చులు అధికంగానే ఉంటాయి. కష్టసమయంలో మిత్రులు అండగా నిలుస్తారు. ప్రింటింగ్ రంగాల వారికి శ్రమాధిక్యత తప్పదు. ప్రియతముల రాక సంతోషం కలిగిస్తుంది. 
 
కుంభం : వ్యాపారాభివృద్ధికి చేయు కృషిలో సత్ఫలితాలు లభిస్తాయి. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. మీరు చేయు పనికి ప్రోత్సహం లభిస్తుంది. హోటల్, తినుబండరాలు, క్యాటరింగ్ పనివారలకు పురోభివృద్ధి. ఉద్యోగస్తులకు తోటివారి సహాయం లభించదు. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి కొన్ని లక్ష్యాలు సాధిస్తారు. 
 
మీనం : బేకరీ, తినుబండరాలు, పండ్ల వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి. ఉద్యోగస్తులకు రావలసిన క్లైమ్‌లు మంజూరవుతాయి. ఏకాగ్రత లోపించటం వల్ల విద్యార్థినులు ఒత్తిడి, ఆందోళనలకు గురవుతారు. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి కలుగుతుంది. విద్యార్థులకు వాహనం, విలాస వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. 

 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు