ఆదివారం దినఫలాలు - నిరుత్సాహం వీడి ఇంటర్వ్యూలకు...
ఆదివారం, 27 మే 2018 (09:31 IST)
మేషం: రాజకీయ నాయకులు కొంత సంక్షోభం ఎదుర్కొనక తప్పదు. కాంట్రాక్టర్లు పెద్ద పెద్ద కాంట్రాక్టులు చేజిక్కించుకుంటారు. దైవ కార్యాలు మానసిక ప్రశాంతతనిస్తాయి. వాహనం ఇతరులకుఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. నిరుద్యోగులు నిరుత్సాహం వీడి ఇంటర్వ్యూలకు హజరుకావటం మంచిది.
వృషభం: భాగస్వామిక ఒప్పందాలు రద్దు చేసుకుంటారు. ఆత్మీయులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. సొంతంగా వ్యాపారం చేయాలనే మీ సంకల్పం కార్యరూపం దాల్చుతుంది. మీ ఉన్నతిని చాటుకోవటానికి ధనం విచ్చలవిడిగా వ్యయం చేస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. స్త్రీలు విదేశీ వస్తువుల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు.
మిథునం: వృత్తిరీత్యా ప్రముఖులను కలుసుకుంటారు. నిరుద్యోగులకు ప్రయత్నపూర్వకంగా సదవకాశాలు లభిస్తాయి. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. నిర్మాణ పనుల్లో బిల్డర్లకు, కాంట్రాక్టర్లకు ఏకాగ్రత ముఖ్యం. దూర ప్రయాణాల్లో చికాకులు తప్పవు. దైవ కార్యాల్లో పాల్గొంటారు. కుటుంబీకులతో ఏకీభవించలేకుపోతారు.
కర్కాటకం: బంధుమిత్రులు మిమ్ములను గురించి అపోహపడే ఆస్కారం ఉంది. నూతన రుణాల కోసం అన్వేషిస్తారు. అతిధి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. పత్రిక ప్రైవేటు సంస్ధలలోని వారికి పనిభారం, విశ్రాంతి లోపం వంటి చికాకులు తప్పవు. ఇతరులకు వాహనం ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి.
సింహం: ఆదాయ వ్యయాలు సంతృప్తికరంగా ఉంటాయి. వాహనం నడుపుతున్నపుడు మెళకువ వహించండి. మీ పనులు మందకొడిగా సాగటం, జాప్యం వంటి చికాకులు ఎదుర్కుంటారు. విద్యార్థుల్లో మానసిక ప్రశాంతత చోటు చేసుకుంటుంది. మీ ముఖ్యుల కోసం ధనం బాగా వెచ్చించవలసి ఉంటుంది.
కన్య: ఉద్యోగస్తులకు ప్రమోషన్, నగదు అవార్డు వంటి శుభ సంకేతాలున్నాయి. స్త్రీలకు అయిన వారి నుంచి ఆదరణ లభిస్తుంది. వస్త్ర, బంగారం, వెండి, రత్న వ్యాపారులకు పనివారలతో చికాకులు తప్పవు. మీ పట్టుదల, అంకితభావం ఇతరులకు మార్గదర్శకమవుతుంది. సోదరీ, సోదరుల మధ్య మనస్పర్థలు తలెత్తుతాయి.
తుల: నిత్యావసర వస్తు స్టాకిస్టులకు, వ్యాపారులకు సంతృప్తి కానవస్తుంది. సోదరీ సోదరుల నుంచి చికాకులు తప్పవు. ఆరోగ్యం దెబ్బతినడంతో మానసికంగా ఆందోళన చెందుతారు. మిమ్మిల్ని పొగిడే వారే కానీ సహకరించే వారుండరని గమనించండి. విదేశీయానం కోసం చేసే యత్నాల్లో సఫలీకృతులవుతారు.
వృశ్చికం: స్త్రీలు శుభకార్యాల్లో కలుపుగోలుగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. దూర ప్రయాణాల్లో మెళకువ వహించండి. మీ ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. ఖర్చులు పెరగటంతో రుణాలు, చేబదుళ్ళు తప్పువు. ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి.
ధనస్సు: మీ సంతానం ఆహార, ఆరోగ్యంలో మెళకువ అవసరం. మీ ఉన్నతిని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. దైవ దర్శనాల్లో పాల్గొంటారు. సంగీత సాహిత్య సదస్సులలో మంచి గుర్తింపు లభిస్తుంది. కుటుంబీకులతో కలసి విందు, వినోదాలలో పాల్గొంటారు. విశ్రాంతికై చేయు యత్నాలు అనుకూలిస్తాయి.
మకరం: రచన, సాహిత్య రంగాల వారికి ప్రోత్సాహకరం. మీ సంతానం విదేశీ చదువుల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. స్త్రీలకు విదేశీ వస్తువుపట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ నిర్లక్ష్యం వల్ల విలువైన వస్తువులు చేజారిపోతాయి. వ్యాపార రీత్యా దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది.
కుంభం: రాజకీయ నాయకులు యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. దంపతుల మధ్య అన్యోన్యత, గృహంలో ప్రశాంతత నెలకొంటాయి. ఎ.సి. కూలర్లు మెకానికల్ రంగాల వారికి సంతృప్తి కానవచ్చును. సంఘంలో మీ మాటకు గుర్తింపు లభిస్తుంది.
మీనం: ఆర్థిక విషయాలలో ఒకడుగు ముందుకు వేస్తారు. శ్రీవారు శ్రీమతి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపిస్తారు. ధనం అందటంతో పొదుపు దిశగా మీ ఆలోచనలుంటాయి. విందులలో పరిమితి పాటించండి. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో మెళకువ అవసరం. మితిమీరిన ఆలోచనలు మీ మనస్సును వ్యాకులపరుస్తాయి.