మేషం: ఆర్థిక, కుటుంబ సమస్యలు క్రమేణా సర్దుకుంటాయి. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్లు అనుకూలిస్తాయి. దూరప్రయాణాలలో అసౌకర్యానికి లోనవుతారు. ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులకు యూనియన్ వ్యవహారాలల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు లాభదాయకం.
వృషభం: గృహంలో ఒక శుభకార్యానికి తీవ్రంగా యత్నాలు సాగిస్తారు. కలప, ఐరన్,క ఇటుక, సిమెంట్ వ్యాపారులకు, స్టాకిస్టులకు పురోభివృద్ధి. స్త్రీలు పంతాలకు పోకుండా విజ్ఞతతో వ్యవహరించవలసి ఉంటుంది. నూతన ప్రదేశ సందర్శనల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వాయిదా పడిన మెుక్కుబడులు వాయిదా పడుతాయి.
మిధునం: ఆదాయానికి మించి ఖర్చులు, చెల్లింపులు వలన స్వల్ప ఆటుపోట్లు ఎదుర్కుంటారు. వ్యాపారాల్లో కష్టనష్టాలను ధైర్యంగా ఎదుర్కుంటారు. కాంట్రాక్టర్లకు నిర్మాణ పనుల్లో ఏకాగ్రత ముఖ్యం. ఉద్యోగ విరమణ చేసిన వారికి రావలసిన బెనిఫిట్స్ చేతికందుతాయి. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు.
కర్కాటకం: ప్రతి విషయాన్ని మీ శ్రీమతికి తెలియజేయడం మంచిది. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులు ఆశించిన ప్రమోషన్లు, బదిలీలు అనుకూలించడానికి మరి కొంతకాలం పడుతంది. మిత్రుల కారణంగా మీ కార్యక్రమాలు వాయిదాపడుతాయి.
సింహం: ఏజెంట్లకు, బ్రోకర్‌లకు అనుకూలం. ప్రముఖుల కలయికా వాయిదా పడటంతో నిరుత్సాహానికి గురవుతారు. స్త్రీలు అనవసరపు విషయాలకు ప్రాధాన్యం ఇచ్చి ఇబ్బందులకు గురవుతారు. అందరితో కలిసి విందు, వినోదాలలో చురుకుగా పాల్గొంటారు. చేపట్టిన పనులలో ఒత్తిడి, చికాకులు, ఆటంకాలు ఎదురవుతాయి.
కన్య: వస్త్ర రంగాలలో వారికి పనిభారం అధికమవుతుంది. కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు నిర్మాణ పనులలో ఏకాగ్రత ఎంతో ముఖ్యం. స్త్రీలు పొట్ట, తల, నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కుంటారు. మీరు ప్రేమించే వ్యక్తితో మరింత ఆనందాన్ని పొందుతారు. గృహంలో మార్పులు చేర్పులు కొంత అసౌకర్యం కలిగిస్తాయి.
తుల: వృత్తి పనుల కారణంగా కుటుంబ సభ్యులకు ఇచ్చిన వాగ్దానాలు నిలుపుకోలేకపోతారు. విద్యార్థినులు ప్రేమవ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది. కలప, ఇటుక, ఇనుము వ్యాపారస్తులకు కలిసిరాగలదు. కళా, క్రీడాకారులకు సదవకాశాలు లభిస్తాయి. స్త్రీలు పనిలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు.
వృశ్చికం: మీ నూతన ఆలోచనలు క్రియా రూపంలో పెట్టి జయం పొందండి. బంధువుల రాకతో ఊహించని ఖర్చులు అధికం కావడం వలన ఆందోళన వంటివి పెరుగుతాయి. మీ శ్రీమతి సలహా పాటించడం వలన ఒక సమస్య నుండి బయటపడుతారు. మిత్రులు మీ గురించి చేసిన వ్యాఖఅయాలు మనస్తాపం కలిగిస్తాయి.
ధనస్సు: కోళ్ళ, మత్స్య, గొర్రెల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. సోదరీసోదరుల గురించి ఓ రహస్యం తెలుసుకుంటారు. నిత్యావసర వస్తు వ్యాపారస్తులకు, స్టాకిస్టులకు పురోభివృద్ధి కానరాగలదు. స్త్రీలకు స్వీయ సంపాదన పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆకస్మిక ప్రయాణాలు వాయిద పడుట వలన ఆందోళన చెందుతారు.
మకరం: మందులు, సుగంధ ద్రవ్య వ్యాపారస్తులకు కలిసివచ్చే కాలం. ఉద్యోగస్తులకు అడ్వాన్సులు మంజూరవుతాయి. ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు. కోర్టు వ్యవహారాలు వాయిదా పడడం మంచిది. వైవాహిక జీవితంలో అనుకోని చికాకులు తలెత్తుటకు ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి.
కుంభం: ఆర్థికలావాదేవీలు, మధ్యవర్తిత్వాలు సమర్థంగా నిర్వహిస్తారు. కొబ్బరి, పండ్లు, పానీయ వ్యాపారాలు ఊపందుకుంటాయి. బ్యాంక్ వ్యవహారాలలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. ప్రింటింగ్ రంగాల్లో వారు అచ్చుతప్పులు పడడం వలన మాటపడతారు. రాబడికి మించిన ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి.
మీనం: మీ సంతానం మెుండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. విదేశాలు వెళ్లటానికి చేయు ప్రయత్నాలు వాయిదాపడుతాయి. చేపట్టిన వ్యాపారాల్లో నిలదొక్కుకోవడానికి నిరంతర శ్రమ, ఓర్పు ఎంతో ముఖ్యం. ఆత్మీయుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది.