30-06-2020 మంగళవారం రాశిఫలాలు - ఈశ్వరుడిని పూజిస్తే జయం...

మంగళవారం, 30 జూన్ 2020 (05:00 IST)
మేషం : మీ సంకల్ప సిద్ధికి నిరంతరం శ్రమ, పట్టుదల చాలా ముఖ్యమని గమనించండి. వ్యాపార వర్గాల వారి మాటతీరు, స్కీములు కొనుగోలుదార్లను ఆకట్టుకుంటాయి. ఇన్వెర్టర్, జనరేటర్, ఏసీ మెకానికల్ రంగాల్లో వారు ఆర్థికంగా ఒక అడుగు ముందుకువేస్తారు. ఉపాధ్యాయులకు, మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి అధికం. 
 
వృషభం : పూర్వానుభవంతో ముందుకు సాగుతారు. చిన్న తరహా వ్యాపారస్తులకు, భూమి సంబంధించిన వ్యాపారస్తులకు కలిసిరాగలదు. స్త్రీలకు స్వీయ అర్జన పట్ల ఆసక్తి, ప్రోత్సాహం లభిస్తాయి. ఇతరులకు వాహనం ఇవ్వడం వల్ల ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. విద్యార్థులు మితిమీరిన ఉత్సాహం వల్ల సమస్యలు తప్పవు. 
 
మిథునం : ఆర్థికంగా పురోభివృద్ధి కానవస్తుంది. కొబ్బరి, పండ్లు, పానీయ వ్యాపారస్తులకు సంతృప్తి. అభివృద్ధి కానరాగలదు. ఆశయ సాధనే అత్యున్నత లక్ష్యంగా బాధ్యతగా భావించాలి. కళాకారులకు, రచయితలకు అంతరిక్ష పరిశోధకులకు మంచి గుర్తింపు లభిస్తుంది. దంపతుల మధ్య ఆసక్తికరమైన విషయాలు చర్చకు వస్తాయి. 
 
కర్కాటకం : ఉద్యోగస్తులకు అధికారు నుంచి గుర్తింపు, ప్రశంసలు లభిస్తాయి. గృహం ఏర్పరచుకోవాలనే కోరిక నెరవేరుతుంది. స్త్రీలకు ఆహ్వానాలు, వస్త్ర, వస్తు లాభం వంటి శుభఫలితాలుంటాయి. వీరికి టెక్నికల్, ఇంజనీరింగ్ కోర్సులలో ప్రవేశం లభిస్తుంది. ఖర్చులు, రావలసిన ధనం వసూలులో కించిత్ ఇబ్బంది తప్పదు. 
 
సింహం : ప్రభుత్వరంగ సంస్థలలో వారికి అశాంతి, చికాకులు అధికం కాగలవు. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. వ్యాపారాభివృద్ధికి నూతన ప్రణాళికలు అమలు చేస్తారు. పెద్దల ఆరోగ్యంలో తగు జాగ్రత్తలు అవసరం. రాబడికి మించిన ఖర్చులెదుర్కొంటారు. కొంతమంది మీ నుంచి విషయాలు రాబట్టడానికి యత్నిస్తారు. 
 
కన్య : స్త్రీలు ప్రముఖుల సిఫార్సుతో దైవ దర్శనాలను త్వరగా ముగించుకుంటారు. విద్యార్థుల్లో నూతనోత్సాహం చోటుచేసుకుంటుంది. కొన్ని ఆర్థిక సమస్యలు ఎదుర్కోవచ్చు. జాగ్రత్త వహించండి. బాగానమ్మే వ్యక్తులే మిమ్మలను మోసం చేసే ఆస్కారం ఉంది. భాగస్వామిక చర్చల్లో మీ ప్రతిపాదనలకు ఆమోదం లభించవచ్చు. 
 
తుల : ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. సోదరీ, సోదరుల మధ్య పరస్పర అవగాహనా లోపం. రాజకీయాల వారికి చికాకులు తప్పవు. స్త్రీలు విదేశీ వస్తువులు సేకరిస్తారు. వాహనం నడుపుతున్నపుడు మెలకువ వహించండి. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. 
 
వృశ్చికం : ప్రైవేటు ఉపాధ్యాయులకు ఒత్తిడులు, చికాకులు తప్పవు. గృహోపకరణాలకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. రాజకీయాల్లో వారికి ఆందోళన తప్పదు. శాస్త్ర, సాంకేతిక రంగాల వారికి ప్రోత్సాహం లభిస్తుంది. రుణాలు, పెట్టుబడుల కోసం ప్రయత్నిస్తారు. ఖర్చులు అదుపు చేయాలన్న మీ యత్నం ఫలించదు. 
 
ధనస్సు : ఆర్థిక పెట్టుబడుల గురించి స్పష్టమైన నిర్ణయానికి వస్తారు. ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. దీర్ఘకాలం వాయిదాపడుతున్న పనులు పూర్తిచేస్తారు. ఉద్యోగస్తులకు పనిభారం అధికం. స్త్రీలకు నూతన వస్తు, వస్త్ర ప్రాప్తి కలుగుతుంది. వైద్యులకు నిరుత్సాహం కానవస్తుంది. 
 
మకరం : కాంట్రాక్టర్లకు నూతన టెండర్ల విషయంలో పునరాలోచన అవసరం. తీర్థయాత్రలు, నూతన ప్రదేశాల సందర్శనలు అనుకూలిస్తాయి. ధనం కంటే ఆత్మగౌరవానికే ప్రాధాన్యం ఇస్తారు. బంధువుల రాకతో ఖర్చులు అధికమవుతాయి. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్లు, ఫ్లీడరు గుమస్తాలకు ఊహించని చికాకులు ఎదురవుతాయి. 
 
కుంభం : ఆర్థిక వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనా అధికమిస్తారు. వ్యాపారాల్లో పోటీని తట్టుకునేందుకు బాగా శ్రమించాలి. స్త్రీలు, ఉదరం, నడుము, నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కోవలసి వస్తుంది. వైద్యులు ఆపరేషన్లు చేయుపనడు మెళకువ అవసరం. నేడు చేద్దామన్న పనులు రేపటికి వాయిదా వేస్తారు. 
 
మీనం : ఉభయులకు ఆసక్తికరమైన విషయాలు చర్చిస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పనుమార్లు తిరగవలసి వస్తుంది. ఇంటా, బయట కొన్ని కొత్త సమస్యలను ఎదుర్కొన్నా నెమ్మెదిగా సమసిపోతాయి. మధ్యవర్తిత్వం వహించడం వల్ల మాటపడవలసి వస్తుంది. విద్యార్థులు ఉల్లాసంగా గడుపుతారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు