రాశి ఫలితాలు (27-06-2017)... ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది...

సోమవారం, 26 జూన్ 2017 (21:38 IST)
మేషం : అరుదైన శస్త్రచికిత్సలను డాక్టర్లు విజయవంతం పూర్తిచేస్తారు. కొత్త దంపతులకు పలు ఆలోచనలు స్ఫురిస్తాయి. శత్రువులను మీ వైపునకు ఆకట్టుకుంటారు. ఉద్యోగస్తులు ఊహించని అవరోధాలు తలెత్తినా తెలివితో పరిష్కరించుకోగలుగుతారు. గృహ మరమ్మత్తులు, మార్పులు, చేర్పులు ఆకస్మికంగా వాయిదా పడతాయి.
 
వృషభం : ఊహించిన ఖర్చులే ఉంటాయి. ధనం కోసం వెతుకులాడుకునే ఇబ్బంది ఉండదు. అనుకున్న పనులు ఆశించినంత చురుకుగా సాగవు. హోటల్, తినుబండారు వ్యాపారులకు లాభదాయకం. ప్రయాణాలు బ్యాంకింగ్ వ్యవహారాల్లో ఏకాగ్రత అవసరం. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి సమస్యలను ఎదుర్కొంటారు.
 
మిథునం : రాజకీయనాయకులు కొంత సంక్షోభం ఎదుర్కొంటారు. మీ చిన్నారుల కోసం నూతన పథకాలు వేసి జయం పొందగలుగుతారు. ఉపాధ్యాయులకు సదవకాశాలు లభిస్తాయి. బ్యాకింగ్ వ్యవహారాల్లో మెలకువ వహించండి. విద్యుత్, ఏసీ కూలర్లు, మెకానికల్ రంగాల్లో వారికి సంతృప్తి కానవస్తుంది. 
 
కర్కాటకం: సంఘంలోనూ, కుటుంబంలోనూ గౌరవమర్యాదలు పొందుతారు. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల్లో వారికి శ్రమకు తగిన ప్రతిఫలం కానవచ్చును. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. మిమ్ములను తప్పుదారి పట్టించి లబ్ధిపొందాలని యత్నిస్తారు. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది.
 
సింహం: కాస్త కష్టపడి పనిచేస్తే మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. నిత్యావసర వస్తు స్టాకిస్టులకు వ్యాపారులకు సంతృప్తిని ఇస్తాయి. దేవాలయ, విద్యా సంస్థలకు దానధర్మాలు చేయడం ద్వారా మీ కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం.
 
కన్య : బంధువుల రాకతో ఆకస్మికంగా ఆలయాలను సందర్శిస్తారు. ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు. విద్యార్థినులు పట్టుదలతో శ్రమించిన సత్ఫలితాలు సాధించగలరు. విద్యుత్, ఏసీ కూలర్లు, మెకానికల్ రంగాల్లో వారికి సంతృప్తి కానవస్తుంది. రాజకీయ నాయకులు సేవా కార్యక్రమాల్లో పాల్గంటారు.
 
తుల : ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. మీ సంతానం కోసం ధనం బాగుగా ఖర్చు చేస్తారు. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. ఉమ్మడి కుటుంబ విషయాల్లో మాటపడాల్సి వస్తుంది. వాతావరణంలో మార్పు వల్ల స్త్రీల ఆరోగ్యంలో చిన్న చిన్న సమస్యలు తలెత్తవచ్చు.
 
వృశ్చికం: ఆదాయ వ్యయాలు సరిసమానంగా ఉంటాయి. ఉపాధ్యాయులకు పనిభారం అధికమవుతుంది. పుణ్యక్షేత్ర సందర్శనాలలో మానసికంగా కుదుటపడతారు. ఆస్తి వ్యవహారాల విషయంలో దాయాదుల తీరు నిరుత్సాహం కలిగిస్తుంది. చిట్స్, ఫైనాన్స్ రంగాల వారికి ఖాతాదారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది.
 
ధనుస్సు: బంధువులతో అభిప్రాయభేదాలు తలెత్తుతాయి. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. రియల్ ఎస్టేట్, మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. విద్యార్థులు అత్యుత్సాహం ఇబ్బందులకు దారితీస్తుంది. ఉపాధ్యాయులకు బదిలీ ఉత్తర్వులు అందుతాయి.
 
మకరం : రాజకీయ నాయకులకు పదవీ సమస్యలు అధికమవుతాయి. కొబ్బరి, పండ్ల, పూల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. చేతివృత్తుల వారికి ఓర్పు, నేర్పు, ఎంతో అవసరం. ప్లీడర్లకు, ప్లీడరు గుమాస్తాలకు పురోభివృద్ధి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. పాత మిత్రుల నుంచి ఒక ముఖ్య సమాచారం గ్రహిస్తారు.
 
కుంభం : ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఇబ్బందులు తప్పవు. మొండి బాకీలు వసూలు కొంత మేరకు వసూలు కాగలవు. విద్యార్థులు బజారు తినుబండారాలు భుజించడం వల్ల అస్వస్థతకు లోనవుతారు. సంఘంలో మంచి గుర్తింపు లభిస్తుంది. 
 
మీనం : ఆర్థిక విషయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. ప్రేమికులు క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం అనర్ధాలకు దారితీస్తుంది. ప్రతి విషయంలోను ఓర్పు, సంయమనం చాలా ముఖ్యం. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు మంచిది కాదని గమనించండి. ప్రముఖుల ఇంటర్వ్యూల కోసం పడిగాపులు తప్పవు.

వెబ్దునియా పై చదవండి