#DailyPredictions 28-08-2019- బుధవారం మీ రాశి ఫలితాలు

బుధవారం, 28 ఆగస్టు 2019 (09:16 IST)
మేషం: బ్యాంకు వ్యవహారాలు హడావిడిగా సాగుతాయి. దంపతుల మధ్య ఆసక్తికరమైన విషయాలు చర్చకు వస్తాయి. శస్త్ర చికిత్స సమయంలో వైద్యులకు ఏకాగ్రత అవసరం. మీ బంధువులను సహాయం అర్ధించే బదులు మీరే ప్రత్యామ్నాయం చూసుకోవటం ఉత్తమం. ప్లీడర్లకు కోర్టు వ్యవహారాల్లో మెళకువ వహించండి.
 
వృషభం: దైవ, పుణ్య, సేవా కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. విద్యార్థులకు వాహనం నడుపున్నపుడు ఏకాగ్రత ముఖ్యం. స్త్రీల మాటకు వ్యతిరేకత ఎదురవుతుంది. బ్యాంకు వ్యవహారాలలో మెళుకువ, ఏకాగ్రత అవసరం. వ్యాపారాభివృద్ధికి కొత్త ప్రణాళికలు రూపొందిస్తారు. కోర్టు వ్యవహారాలు విచారణకు వస్తాయి.
 
మిధునం: స్త్రీలకు విదేశీ వస్తువుల పట్ల ఆకర్షితులవుతారు. మీ అజాగ్రత్త వల్ల విలువైన వస్తువు చేజారిపోయే ఆస్కారం ఉంది. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. అద్దె గృహముల కోసం అన్వేషిస్తారు. ప్రభుత్వ పరంగా వేధింపులు అధికమవుతాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది.
 
కర్కాటకం: ఆర్థికంగా కొంత పురోగతి సాధిస్తారు. హోటల్, తినుబండారాలు, క్యాటరింగ్, వృత్తుల వారికి పురోభివృద్ధి. రావలసిన మొండి బాకీలు సైతం వసూలు కాగలవు. ఉపాధ్యాయులకు రిప్రజెంటివ్‌లకు ఒత్తిడి, చికాకులు తప్పవు. ప్రైవేటు సంస్థల్లో వారు అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవటం వల్ల మాటపడక తప్పదు.  
 
సింహం: గృహమునకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. రాజకీయ నాయకులు తరుచు ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సభలు, సమావేశాలలో పాల్గొంటారు. ఉద్యోగస్తులకు తోటివారి నుంచి శుభవార్తలు వింటారు. ఆలయాలను సందర్శిస్తారు. అనుకోని ఖర్చులు, తప్పని సరి చెల్లింపుల వల్ల స్వల్ప ఒడిదుడుకులు తప్పవు. 
 
కన్య: పత్రికా ప్రైవేట్ రంగలలోని వారికి పురోభివృద్ధి కానవస్తుంది. ప్రముఖులతో పరిచయాలు, గుర్తింపు లభిస్తుంది. వైజ్ఞానిక, శాస్త్ర రంగాలలోని వారికి పురోభివృద్ధి కానవస్తుంది. ప్రముఖులతో పరిచయాలు, నూతన బంధుత్వాలు ఏర్పడతాయి. భాగస్వామిక వ్యాపారాల కంటే సొంత వ్యాపారాలలోనే బాగా రాణిస్తారు.
 
తుల: దైవ కార్యాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. అతిధి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. మిత్రుల ప్రోత్సాహంతో ఉపాధి రంగాలలో నిలదొక్కుకుంటారు. విద్యార్థుల మొండి వైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. స్త్రీల  ఆరోగ్యం మందగిస్తుంది. ఊహించని ధననష్టం జరిగే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి. 
 
వృశ్చికం: రుణయత్నాలలో కూడా స్వల్ప ఆటంకాలు ఎదుర్కుంటారు. తలపెట్టిన కార్యాలు ఓర్పు, పట్టుదలతో పూర్తిచేస్తారు. ఉద్యోగస్తులు చాకచక్యంగా వ్యవహరించి ఒక సమస్య నుంచి క్షేమంగా బయటపడతారు. ప్రేమికులకు పెద్దల నుంచి తీవ్ర వ్యతిరేకత ఇతరత్రా చికాకులు అధికమౌతాయి. వాహన సౌఖ్యం పొందుతారు.
 
ధనస్సు: ఆర్థిక ఇబ్బందులు, కుటుంబంలో ఆశాంతి, చికాకులు ఎదుర్కుంటారు. వృత్తుల వారికి సదవకాశాలు లభించిన ఆర్థిక సంతృప్తి అంతంత మాత్రంగానే ఉంటుంది. గతంలో కొంతమందికి ఇచ్చినహామీల వలన తరచు ఇబ్బందులకు గురవుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆకస్మిక ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి.
 
మకరం: ప్రైవేటు సంస్థలలోని వారు మార్పులకై యత్నాలు ఆటంకాలు తప్పవు. నిరుద్యోగులు నిరుత్సాహం అసహనం వంటివి ఎదుర్కుంటారు. బ్యాంకు రుణాలు తీర్చడంతో పాటు భూములు, వ్యవసాయ పనిముట్లు, పశువులు కొనుగోలు చేస్తారు. బంధు మిత్రుల రాకతో ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి, ఏకాగ్రత పెంచుకుంటారు. 
 
కుంభం: ఒక కార్యం నిమిత్తం దూర ప్రయాణం చేయవలసివస్తుంది. ఊహించని ఖర్చులు అధికం కావడంతో స్వల్ప ఒడిదుడుకులు తప్పవు. బంధు మిత్రులను కలుసుకుంటారు. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కాకపోవటంతో ఒకింత నిరుత్సాహానికి గురువుతారు.
 
మీనం: ధనవ్యయం, విరాళాలిచ్చే విషయంలో మెళకువ వహించండి. విదేశీయానం కోసం చేసే యత్నాలు కలిసిరాగలవు. వ్యాపారాభివృ్ద్ధికి చేయు కృషి సత్‌ఫలితాలని ఇస్తుంది. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. ఉద్యోగస్తుల పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు