ఇలాగే దృష్టి దోషాలను తొలగించుకోవాలంటే.. గృహంలో చేపల తొట్టెను వుంచడం చేయొచ్చు. అందులో నలుపు, ఎరుపు రంగు చేపలను పెంచడం చేయొచ్చు. కంటి దృష్టికి చెక్ పెట్టాలంటే.. ఇంట్లో సునితమైన మంగళవాద్యాల శబ్ధాన్ని ఎప్పుడూ వినిపించేలా చేయొచ్చు. కంటి దృష్టిని పోగొట్టే వినాయకుని బొమ్మను వుంచవచ్చు. ఇంకా ఇంటికి ప్రధాన ద్వారం వద్ద కలబంద, బ్రహ్మజెముడు మొక్కలను వేలాడదీయడం చేయొచ్చు.
అలాగే ఈ చెట్లను ఇంటి ముందు పెంచడం ద్వారా దృష్టి లోపాలుండవు. వారానికి ఓసారి ఉప్పు నీటితో స్నానం చేయడం మంచిది. ఇంటిని కూడా ఉప్పు, పసుపు నీటితో కలిపి శుభ్రం చేయడం ద్వారా ప్రతికూల ఫలితాలు దూరమవుతాయి. అమావాస్య, పౌర్ణమి, అష్టమి, నవమి తిథుల్లో ఉదయం, సాయంత్రం పూట ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయడం మరిచిపోకూడదు.