సూర్యోదయ సమయంలో అల్పాహారం తీసుకోవడం, భోజనం చేయడం వంటివి చేస్తే ఆ ఇంట లక్ష్మీదేవి వుండదని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. అలాగే నిరాశావాదులను, తడి పాదాలతో నిద్రపోయేవారిని, వివస్త్రులై నిద్రపోయేవారిని లక్ష్మీదేవి కనికరించదు. ఏది పడితే అది మాట్లాడే వారింట, తమ తలకు రాసుకున్న నూనెను ఇతరులకు అంటించే వారిని కూడా లక్ష్మీ వరించదు.
పశుపక్ష్యాదులను హింసించే తోట లక్ష్మీ వుండదు. లక్ష్మీదేవి కటాక్షం దక్కాలంటే.. తులసిని పూజించాలి. శంకరుడిని, విష్ణుమూర్తిని ప్రార్థించాలి. ఇల్లు ఎప్పుడూ కళ కళలాడుతూ వుండాలి. ఇల్లాలు కంటతడి పెట్టకూడదు. ఏకాదశి, జన్మాష్టమి రోజుల్లో భోజనం చేసే వారింట లక్ష్మీదేవి నివాసం వుండదు. హృదయంలో పవిత్రతను కలిగివున్న చోట లక్ష్మీదేవి కటాక్షంతో అష్టైశ్వర్యాలు చేకూరుతాయని ఆధ్యాత్మిక పండితులు సెలవిస్తున్నారు.