కీరదోస మిశ్రమంలో పెరుగు కలుపుకుని ముఖానికి రాసుకుంటే?

శుక్రవారం, 21 సెప్టెంబరు 2018 (12:12 IST)
కీరదోస మిశ్రమంలో పెరుగు కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. అరగంట తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన కంటి కిందటి నల్లటి వలయాలు తొలగిపోతాయి. బియ్యపు పిండిలో కొద్దిగా రోజ్ వాటర్, బాదం నూనె, పసుపు కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత కడిగేసుకోవాలి. దీంతో ముఖం కాంతివంతంగా, తాజాగా మారుతుంది.
 
ఉసిరి కాయ పొడిలో ఆలివ్ నూనె, పెరుగు కలుపుకుని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 20 నిమిషాల తరువాత శుభ్రం చేసుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది. గ్రీన్ టీ ఆకులను పేస్ట్‌లా చేసుకుని అందులో కొద్దిగా నీరు, చక్కెర కలుపుకుని ముఖానికి రాసుకుని 15 నిమిషాల తరువాత శుభ్రం చేసుకుంటే ముఖంపై గల నల్లటి మచ్చలు తొలగిపోతాయి. 
 
కాకరకాయ రసంలో కొద్దిగా నిమ్మరసం, ఉప్పు కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. అరగంట తరువాత శుభ్రం చేసుకుంటే ముఖం మెుటిమలు తొలగిపోతాయి. నారింజ తొక్కల పొడిలో ఉప్పు, మిరియాల పొడి కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు