ఆంజనేయుడిని పూజిస్తే శివుడిని, విష్ణువును కలిసి పూజించిన పుణ్యం లభిస్తుంది. రామాయణంలో హనుమంతుడు ప్రధాన పాత్ర. గురు, శనివారాలు హనుమంతునికి ముఖ్యమైన పూజాదినములు. వెన్నతో హనుమంతుడిని పూజిస్తే వెన్న కరిగిపోయినట్లే కష్టాలు తొలగిపోతాయి.
హనుమంతునికి తులసిని శనివారం సాయంత్రం అర్పించి పూజిస్తే శనీశ్వరుని ప్రభావం నుండి విముక్తి పొందవచ్చు. హనుమంతుని ఆరాధన వలన జ్ఞానం, బలం, కీర్తి, నిర్భయత, ఆరోగ్యం లభిస్తాయి.
వివాహం కోసం ప్రార్థించే వారు గురువారం సాయంత్రం హనుమంతుడిని పూజించాలి. గురు, శనివారాల్లో నిమ్మకాయను, వడమాలతో హనుమంతుడిని పూజించడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి.