కార్తీకశుద్ధ ఏకాదశి రోజున పూజ.. చేయాల్సిన పనులు

గురువారం, 3 నవంబరు 2022 (19:30 IST)
కార్తీక మాసంలో వచ్చే ఏకాదశినే కార్తీకశుద్ధ ఏకాదశి అంటారు. ఈ కార్తీకశుద్ధ ఏకాదశికే భోధన ఏకాదశి, దేవ-ప్రబోధిని ఏకాదశి, ఉత్థాన ఏకాదశి అని కూడా అంటారు. ఆషాడ శుద్ధ ఏకాదశి రోజున పాలకడలిలో యోగనిద్రకు ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు కార్తీక ఏకాదశి రోజునే మేల్కొంటాడని పురాణాలు చెప్తున్నాయి. 
 
అంతేకాదు విష్ణువు తిరిగి సృష్టిని తిరిగి చేపడతాడని విశ్వాసం. అందుకే కార్తీక ఏకాదశి నుంచి తిరిగి శుభకార్యాలు చేపడతారు. ఈ రోజున ఉపవాసం దీక్ష చేసేవారు స్వర్గానికి చేరుకుంటారు.
 
ఉత్థాన ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసి ఉపవాస వ్రతం చేపట్టాలి. విష్ణువుకు కుంకుమ, పాలతో అభిషేకం చేసి, ఆపై హారతిని ఇవ్వాలి.
 
దేవుత్తని ఏకాదశి నాడు శ్రీమహావిష్ణువుకు తెల్లని పదార్ధాలను నైవేద్యాలు సమర్పించాలి. తెలుపు రంగు మిఠాయిని సమర్పించాలి. ఉడికించిన ఆహారాన్ని తీసుకోకూడదు. ఏకాదశి వ్రతం పాటించే వ్యక్తి ముందు రోజు సాయంత్రం నుంచి అన్నం తీసుకోవడం మానేయాలి.
 
కార్తీక శుద్ధ ఏకాదశి రోజున తులసిని పూజించడం మరచిపోకూడదు. సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. నిర్జల ఉపవాసం వుండలేని వారు పాలు, పండ్లు తీసుకోవచ్చు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు