1. పుట్టు మచ్చ వ్రేళ్లమీదనున్న ఐశ్వర్యం, కుడి చెయ్యి బొటనవ్రేలిమీద ఉన్నటో మాటనేర్పరియు, ప్రజాధికారం గలవాడు నగును. మచ్చ చూపుడువ్రేలు మీద ఉన్నచో దుర్మార్గ ప్రవర్తన కలుగజేయును.
3. మచ్చ ఉంగరం వ్రేలిమీద ఉన్నచో యాగ, హోమ, తర్పణాది సత్కార్యములు చేయు వాడును, విలువయగు ఉంగరములు ధరించు వాడును, సజ్జనసహవాసం చేయువాడును, తీర్థయాత్రలు చేయువాడును, సందాచారసంపన్నుడును, దానధర్మ పరోపకారాది సత్కార్యములు చేయువాడును, కీర్తిని ఆర్జించువాడగును.
4. చికికెనవ్రేలుమీద పుట్టుమచ్చ ఉన్నచో సదా స్త్రీలతో కాలం గడుపువాడును, భూషణాలంకారం యందు ప్రీతి కలవాడును, మంచివస్త్రము ధరించువాడును, ధనవంతుడగును.
5. అరిచేతియందు పుట్టుమచ్చ ఉన్నచో మంచి స్వభామము గలవాడును, కవిత్వము, గణితశాస్త్ర ప్రవీణత గలవాడును, పట్టువస్త్రములు ధరించువాడును, బంగారం తరుచువాడగును.