పుట్టుమచ్చ అనేది పుట్టుకతో వచ్చేది.. కాబట్టి ప్రతీ ఒక్కరిలో తప్పకుండా ఉంటుంది. కొందరైతే శరీరంపై మచ్చలు ఎక్కువగా వస్తున్నాయని వాటిని తొలగించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఇలా చేయడం వలన ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని చెప్తున్నారు పండితులు. మరి పుట్టుమచ్చలు ఈ ప్రాంతాల్లో ఉంటే కలిగే లాభాలు, నష్టాలు ఓసారి పరిశీలిద్దాం..
మోకాళ్లు:
కుడి మోకాలి మీద పుట్టుమచ్చ ఉన్నచో వారికి సౌందర్యవంతమైన భార్య లభిస్తుంది. స్త్రీ సౌఖ్యం కలిగియుండును. భార్య మాటప్రకారం సంచరించుకొను వాడగును. ఐశ్వర్యవంతుడై, భోగభాగ్యాలు అనుభవిస్తారు. అంతేకాకుండా వారికి సకలసౌభాగ్యాలు కూడా చేకూరుతాయని పురాణాలు చెబుతున్నాయి.
ఎడమ మోకాలి మీద పుట్టుమచ్చ ఉన్నచో వారికి అల్బబుద్ధి, స్వల్పభోగం, సామాన్యధనం, నీచస్త్రీల సహవాసం, సేవకావృత్తి, కుటుంబ చిక్కులు మొదలగు చెడ్డ ఫలితాలు కలుగును.
తొడలు:
కుడి తొడమీద పుట్టుమచ్చ ఉంటే.. వారు ధనవంతుడును, సమస్తభోగముల ననుభవించు వాడగును. స్త్రీ మూలమున విశేషధనలాభం కలుగును. కీర్తిని సంపాదించువాడగును. రంగములకు బోవుటకు కుతూహలం కలిగియుండును. ఈ మచ్చఉన్నచో వ్యాపారం చేసి జీవించువాడగును. మంచి ఆరోగ్యం కలిగియుండును. మెుత్తం మీద కుడితొడ యందలి పుట్టుమచ్చ మంచి ఫలితాలనే కలుగజేయును.
ఎడమ తొడమీద పుట్టుమచ్చ ఉంటే.. వరు స్త్రీలతో భోగించుచుండువాడును, దరిద్ర్యం బాధపడువాడను. ప్రయత్న కార్యమ అపజయం పొందుచుండువాడును. దేశ సంచారం చేయువాడును, జీవితమును కష్టంగా గడుపువాడును, కులాచారములు విడుచువాడును. అంతేకాదు, ఇతరులను ఆశ్రయించి జీవించువాడగును.