కార్తీక మాసం చివరి ఐదు రోజులు.. ఇవి తప్పనిసరి..

గురువారం, 10 డిశెంబరు 2020 (05:00 IST)
కార్తీక మాసం.. 25వ రోజు.. దశమిరోజున అన్నసంతర్పణలు చేస్తే విష్ణువుకు ప్రీతిపాత్రులై కోరికలు తీరుతాయి. అలాగే 26వ రోజు.. ఏకాదశి రోజున కుబేరుడిని పూజిస్తారు. వైష్ణవ ఆలయంలో దీపారాధన, పురాణ శ్రవణం, పఠనం, జాగరణ, విశేష ఫలితాలు ఇస్తాయి.
 
27వ రోజున ద్వాదశి పర్వదినాన కార్తీక దామోదరుడిని పూజించాలి. అన్నదానం లేదా స్వయంపాకం సమర్పించాలి. ఫలితంగా మహాయోగం, రాజభోగం, మోక్షసిద్ధి లభిస్తాయి. అలాగే 28వ రోజు త్రయోదశి రోజున నవగ్రహ ఆరాధన మంచిది. దీంతో గ్రహదోషాలు తొలగుతాయి.
 
29వ రోజు.. మాసశివరాత్రి నాడు ఈశ్వరార్చన, అభిషేకం చేస్తే అపమృత్య దోషాలను, గ్రహ బాధలను తొలగిస్తాయి. 30వ రోజు : అమావాస్యనాడు పితృదేవతల పేరిట అన్నదానం లేదా ఉప్పు, పప్పుతో కూడిన సమస్త పదార్థాలను దానం చేయాలి. దీని వల్ల పెద్దలకు నరకబాధలు తొలగుతాయి. స్వర్గ సుఖాలు ప్రాప్తిస్తాయని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు