ఇవేకాక అనంత పద్మనాభ స్వామి వ్రతం, గోష్టి, గురుదేవుల సమక్షంలో భక్తులు సామూహిక గ్రహణ జపం చేసుకోగలిగారు. వాతావరణం పూర్తిగా అనుకూలించింది. నేపాల్ వెళ్తే బాగుండు అని అనుకునే వారికి ఎందుకు ఆ ప్రణాళిక పెట్టలేదు అని గురుదేవుల ముహూర్త బలం మరొకసారి మనకు తెలియజేస్తోంది. అందరూ క్షేమంగా గురుదేవుల ఆశీస్సులతో గమ్యస్థానాలు చేరారు.
ఇంతటి కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్క భక్తులకు, శిష్యులకు, వాలంటీర్లకు, పక్క వారికి సాయం చేసిన ప్రతి ఒక్క వారికి అనేక నమస్సులు. ఏదైనా కార్యక్రమం విజయవంతమైంది అని అంటే అది కేవలం ప్రతి ఒక్కరి సహాయ సహకారములు ఉన్న రోజులు మాత్రమే. దానితోపాటుగా గురుబలం దైవ బలం మనం వెంటే ఉండి ఈ కార్యక్రమాన్ని పూర్తిగా విజయవంతం అయ్యేలా చేశాయి.