సోమవారం ఈశ్వరునికి దీపం వెలిగిస్తే?

ఆదివారం, 21 ఆగస్టు 2022 (21:53 IST)
దీపం జ్ఞానానికి, శాంతికి, సంపదకు ప్రతీక అని, సృష్టి స్థితి లయకారకులు, వారి దేవేరులు దీపంలోనే నిక్షిప్తమై ఉంటారని ప్రతీతి. నిత్యదీపారాధన ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయం అవుతాయి. 
 
సోమవారాలు, శుద్ధ ద్వాదశీ, చతుర్దశీ, పౌర్ణమి తిథులనాడైనా శివునికి దీపాలు వెలిగించాలి. అందుకూ అవకాశం లేని వారు మాసంలో వచ్చే పున్నమినాడు 365 వత్తులు గల గుత్తి దీపాన్ని వెలిగిస్తే ఏడాది పొడువునా దీపాలు పెట్టినంత పుణ్యం కలుగుతుంది. 
 
దీపాన్ని పంచభూతాత్మకమైన సృష్టికి ప్రతీకగా చెప్తున్నారు. దీపానికి వాడే ప్రమిద భూతత్వానికి, వత్తి ఆకాశతత్వానికి, తైలం జలతత్వానికి, వెలిగేందుకు సహకరించే గాలి వాయుతత్వానికి, జ్యోతి అగ్నితత్వానికి ప్రతీకలుగా చెప్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు