01-08-2022 సోమవారం దినఫలాలు - ఈశ్వరుడిని పూజించి అర్చించినా....

సోమవారం, 1 ఆగస్టు 2022 (04:00 IST)
మేషం :- గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. విందు, విలాసాలకు బాగావ్యయం చేస్తారు. ఆత్మీయుల నుండి ఆహ్వానాలు అందుకుంటారు. రావలసిన ఆదాయం అందుతుంది. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. స్థిరాస్తి కొనుగోలు దిశగా మీ ఆలోచనలుంటాయి. ప్రైవేటు సంస్థల్లో వారికి కష్టానికి తగిన గుర్తింపు, ప్రతిఫలం లభిస్తాయి.
 
వృషభం :- మీపై శకునాలు, ఇతరుల వ్యాఖ్యల ప్రభావం అధికం. ఉద్యోగస్తుల సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. అవసరానికి ధనం సర్దుబాటు చేసుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. ఒక నష్టాన్ని మరో విధంగా పూడ్చుకుంటారు. వ్యాపారులు కొనుగోలుదార్లతో చికాకులు, సమస్యలు ఎదుర్కుంటారు.
 
మిథునం :- ఉపాధ్యాయులకు రిప్రజెంటివ్‌లకు ఒత్తిడి, చికాకులు తప్పవు. ఒకసారి జరిగిన తప్పిదం పునరావృతం కాకుండా జాగ్రత్త పడండి. స్త్రీలు తేలికగా మోసపోయే అస్కారంకలదు. బంధువుల రాకతోపనులు, కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు, అధికారులతో పర్యటనలు అధికం.
 
కర్కాటకం :- ఆర్థిక స్థితి సామాన్యంగా ఉంటుంది. ప్రైవేటు రంగాల్లో వారికి ఒత్తిడి. నిరుద్యోగుల యత్నాలు ఫలిస్తాయి. వాయిదా పడిన పనులు పూర్తిచేస్తారు. రాజకీయాల్లో వారు నూతన పదవులు అలంకరిస్తారు. నిర్మాణ పనులు వేగవంతం చేస్తారు. కిరణా, ఫ్యాన్సీ రంగాల్లో వారికి పురోభివృద్ధి. ప్రయాణాలు అనుకూలం.
 
సింహం :- స్థిర, చరాస్తి వ్యవహారాలు ఒక కొలిక్కిరాగలవు. దైవదర్శనాలు అనుకూలిస్తాయి. శుభకార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. రావలసిన ధనం అందుతుంది. విద్యార్థులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. ఉద్యోగులు అధికారుల మన్ననలు పొందగలుగుతారు. కోర్టువ్యవహారాలు వాయిదా పడటం మంచిది.
 
కన్య :- ఆర్థికంగా పురోభివృద్ధి కానవస్తుంది. విలువైన వస్తు ఆభరణాలు అమర్చుకుంటారు. సంతానం చదవులపై శ్రద్ధ వహిస్తారు. విదేశాలు వెళ్ళటానికి చేయుప్రయత్నాలు అనుకూలిస్తాయి. ముఖ్యుల కలయిక వాయిదా పడుతుంది. ఉద్యోగస్తులకు శ్రమాధిక్యత, ఒత్తిడి ఎదుర్కొంటారు. వృత్తి, వ్యాపారులకు సామాన్యం.
 
తుల :- వృత్తి వ్యాపారులకు అనుకూలత.మీ వ్యక్తిగత విషయాలు బయటకు వ్యక్తం చేయకండి. ఖర్చులు అధికం. ప్రయోజనకరం. విద్యార్థులకు ఒత్తిడి, తొందరపాటుతనం కూడదు. నిర్మాణ పనులు వేగవంతం చేస్తారు. బంధుమిత్రులతో సంతోషాన్ని పంచుకుంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. సంతాన విషయాలపై దృష్టిసారిస్తారు.
 
వృశ్చికం :- ఆర్థిక ఇబ్బందులు క్రమేపి తొలగుతాయి. ప్రైవేటు సంస్థల్లో వారికి మార్పులు అనుకూలిస్తాయి. అధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. పెద్దలకు ఆరోగ్యం ఏమాత్రం సహకరించదు. మనోబలం రక్షిస్తుంది. పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోండి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదుర్కొంటారు.
 
ధనస్సు :- ఆర్థిక ఉన్నతికి కృషి చేయవలసి ఉంటుంది. ఉద్యోగస్తులకు సహచరులతో సఖ్యత అవసరం. దూర ప్రయాణాల్లో ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. దైవ సేవా కార్యక్రమాల పట్ల ధ్యాసవహిస్తారు. ప్రతి విషయంలో ఓర్పు, నేర్పు అవసరం. ముఖ్యుల నుండి శుభవార్తలు అందుకుంటారు. నిర్మాణ పనులు వేగవంతం చేస్తారు.
 
మకరం :- ప్రతి విషయానికి ఆందోళన చెందుతారు. ఆప్తులను కలుసుకోవాలనిపిస్తుంది. పనులు, కార్యక్రమాలు వాయిదా పడతాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు సంభవం. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. సాయం చేసేందుకు అయిన వారే సందేహిస్తారు. ప్రముఖులను కలుసుకుంటారు. ఆలోచనలు నిలకడగా ఉండవు.
 
కుంభం :- ఆర్థిక వ్యవహారాలు కొంత నిరాశపరుస్తాయి. వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు పనిభారం తప్పదు. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. ఆలయాలను సందర్శిస్తారు. బంధువుల నుండి ఆహ్వానాలు అందుకుంటారు. ఉద్యోగస్తుల దైనందిన కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. ప్రయాణం ప్రశాంతంగా సాగుతుంది.
 
మీనం :- వ్యాపారాల్లో నష్టాలు తొలగి లాభాలుగడిస్తారు. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. గతంలో వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. కావలసిన వ్యక్తుల కలయిక అనుకూలించదు. ధైర్యంతో యత్నాలు సాగిస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. పుణ్యక్షేత్ర సందర్శనకు సన్నాహాలు సాగిస్తారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు