ఈశ్వర ఆరాధన ద్వారా డబ్బును ఆదా చేసుకోవచ్చునని అంటున్నారు.. ఆధ్యాత్మిక పండితులు. లక్ష్మీదేవి చంచలత్వంగా వుంటుంది. చేతికందిన డబ్బు వృధా అవుతోంది. డబ్బు వచ్చే దారి తెలుస్తుంది కానీ.. పోయేదారి మాత్రం తెలియట్లేదని చాలామంది బాధపడుతూ వుంటారు. అలాంటి వారు మీరైతే.. ఈశ్వర ఆరాధన చేయాలి అంటున్నారు.. ఆధ్యాత్మిక పండితులు.
ఈశ్వరాధన ద్వారా వచ్చిన డబ్బు ఆదా అవుతుంది. ఇంటి నిర్మాణం, రుణ బాధల నుంచి విముక్తి పొందాలంటే.. ప్రదోషకాలంలో శివాలయానికి వెళ్లి పూజ చేయాలి. ఆవు నేతితో దీపమెలిగించాలి. 108 సార్లు శివుని చుట్టూ తిరిగితే కనుక డబ్బు సద్వినియోగం అవుతుంది. వృధా ఖర్చు వుండదని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.