ఆదివారం కొత్త పని ప్రారంభించేటప్పుడు లేదా ఇంటి నుంచి మీరు బయటకు పోయేటప్పుడు తప్పకుండా ఒక గ్లాసు నీళ్లు తాగండి. ఈ నీటిలో కొంచెం చక్కెర వేసుకోవాలి. మాంసాహారాన్ని తీసుకోకండి. నల్ల ఆవు, కోతికి అవకాశం దొరికినప్పుడల్లా ఆహారాన్ని పెట్టండి.
వీలైతే ప్రతిరోజు తల్లిదండ్రుల ఆశీర్వాదాన్ని తీసుకోండి అంటే ప్రతిరోజు తల్లికి నమస్కారం చేయండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరి వద్ద నుంచి మీరు ఉచితంగా ఏ బహుమతిని స్వీకరించకండి. తల్లిదండ్రుల నుంచి తీసుకోవచ్చు.
ఇలా చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం లభిస్తుంది. తద్వారా రవిదోషాలు తొలగిపోతాయి. అనారోగ్య సమస్యలు వేధించవు. ఇంకా ఆయుర్దాయం పెరుగుతుంది. ఆదివారం పూట సూర్య ఆరాధనతో నవగ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి.
పూర్వం బ్రహ్మ దేవుడు తన సృష్టిని విస్తరించదలచారు. ఇందులో భాగంగా సప్తరుషులను సృష్టించాడు. వీరిలో మరిచి ఒకరు. ఈయనకు కాశి అనే కుమారుడు పుట్టాడు. అతనికి 13మంది భార్యలు. వారిలో తొలి భార్యకు పుట్టిన బిడ్డే అతితి. ఈయనకు జన్మించిన వాడే సూర్యభగవానుడు.
ప్రపంచాన్ని కాపాడే బాధ్యత నవగ్రహాలకు అప్పగించడం జరిగింది. ఈ నవగ్రహాలకు సూర్యుడు ఆధిపత్యం వహిస్తాడు. అందుకే సూర్యారాధనతో నవగ్రహాలను తృప్తి పరచవచ్చునని.. తద్వారా నవగ్రహ దోషాలను దూరం చేసుకోవచ్చునని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.