మంగళవారం.. హనుమంతుడికి 108 వెండి తమలపాకుల పూజ చేస్తే..?

మంగళవారం, 9 మార్చి 2021 (05:00 IST)
వివాహం కానివారు, వైవాహిక బంధంలో ఇబ్బందులు ఉన్నవారు, ఆర్ధిక ఇబ్బందులు, వ్యాపారంలో నష్టాలు, ఉద్యోగంలో ఉన్నతి లేనివారు ఇలా ఒకటేమిటి అనేక ఈతిబాధలు ఉండి ఏ పని చేసినా కలిసిరాని వారు ముందుగా హనుమంతుడిని దర్శించి తమ కోరికను స్వామికి మనస్సులో విన్నవించి 7 మంగళవారాలు 108 చొప్పున ప్రదక్షిణలు చేయాలి. కోరిక కోర్కెలు తీరిన తర్వాత 108 ప్రదక్షిణలు చేయడం ఇక్కడి భక్తుల నిత్యఅనుభవం.
 
అంగారక, రాహు దోషాలుతో పాటు ఎటువంటి దోషాలు అయినా స్వామి పూజలో తొలగుతాయని భక్తుల విశ్వాసం. ప్రతీ మంగళ, శుక్ర, శనివారాల్లో ఉదయం 6:00 నుండి 12:00 మధ్య 108 వెండి తమలపాకుల పూజ చేయించడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయి. 
 
అలాగే సువర్చలా హనుమ కల్యాణం జరిపిస్తే సమస్త దోషాలు తొలగిపోతాయి. ప్రతీ నెలా పూర్వాభాద్ర నక్షత్రం రోజు ఉదయం 9:00 గంటలకు ఈ కల్యాణం జరిపించవచ్చు. ఆంజనేయుని పూజిస్తే సర్వదేవతలను ఆరాధించిన ఫలితం దక్కుతుందనేది శాస్త్ర వచనం. హనుమ తక్షణం భక్తుల కోరికలు ఫలప్రదం చేసే దైవం. అందుకే ఆయనను సేవించండి.. తరించండి అంటున్నారు.. ఆధ్యాత్మిక పండితులు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు