మహాలయ అమావాస్య రోజున అరటి ఆకులో నైవేద్యం సమర్పిస్తే?

సోమవారం, 18 సెప్టెంబరు 2017 (14:35 IST)
వినాయక చవితి ముగిసింది. దసరా వచ్చేసింది. నవరాత్రులు ప్రారంభానికి ముందు మహాలయ అమావాస్యను దేశవ్యాప్తంగా వైభవంగా జరుపుకుంటారు. ఈ నెల (సెప్టెంబర్) 19వ తేదీన మహాలయ అమావాస్య. నవరాత్రుల ప్రారంభానికి ముందు రోజైన అమావాస్య నాడు ఘంటాస్థాపన చేస్తారు. మహాలయ రోజున దుర్గాపూజ చేస్తారు. ఇంకా ఈ రోజున పితృదేవతలను నిష్ఠగా పూజిస్తారు. వారికి నచ్చిన వంటకాలు, దుస్తులు, పుష్పాదులను సమర్పిస్తారు. మహాలయ అమావాస్య రోజున మధ్యాహ్నం 12 గంటల్లోపు పితృదేవతలకు పూజలు, శ్రాద్ధం సమర్పించాలి. 
 
పుణ్యతీర్థాల వద్ద పితృదేవతలకు శ్రాద్ధం ఇవ్వాలి. ఇలా చేయడం ద్వారా పితృదేవరులు సంతోషించి.. సుఖశాంతులను ప్రసాదిస్తారని విశ్వాసం. పితృదేవతలకు నచ్చిన ఆహారం, దుస్తులు, స్వీట్లు సమర్పించి వాటిని బ్రాహ్మణులను ఇవ్వడం ద్వారా పుణ్య ఫలాలను పొందవచ్చు. ఆ రోజున సూర్యోదయానికి ముందే లేచి.. పూజకు అంతా సిద్ధం చేసుకోవాలి. గడపకు తోరణాలు, పూజ గదిని శుభ్రం చేసుకుని పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి.
 
ఆపై నైవేద్యానికి ఆహారం, పుష్పాలు, దుస్తులు వుంచుకోవాలి. ఆ రోజున పితృదేవతలకు సమర్పించేందుకు చెంబు, వెండి పాత్రలను ఉపయోగించడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. లేకుంటే తప్పకుండా అరటి ఆకులపై నైవేద్యాన్ని సమర్పించుకోవచ్చు. అరటి ఆకుతో నైవేద్యం ద్వారా సంతృప్తి చెందే పితృదేవరులు తమ వంశీయులకు సుఖసంతోషాలను ప్రసాదిస్తారని విశ్వాసం. పాయసం, అన్నం, పప్పు వంటివి మహాలయ అమావాస్య రోజున నైవేద్యాలుగా సమర్పించుకోవచ్చు. అలాగే పసుపు గుమ్మడి కాయను నైవేద్యంగా పెట్టుకోవాలి.
 
దుర్గా పూజ క్యాలెండర్ 2017
మహాలయ 2017 - 19వ తేదీ సెప్టెంబర్ 2017 
మహా పంచమి - 25 సెప్టెంబర్ 2017 
మహా షష్ఠి -  26 సెప్టెంబర్ 2017 
మహా సప్తమి - 27 సెప్టెంబర్ 2017 
మహా అష్టమి  - 28 సెప్టెంబర్ 2017 
మహా నవమి - 29 సెప్టెంబర్ 2017 
విజయ దశమి - 30 సెప్టెంబర్ 2017

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు