మహాలయ పక్షం.. నాగదేవతలకు పితృదేవతలకు ప్రతిరూపాలా?

మంగళవారం, 13 సెప్టెంబరు 2022 (21:50 IST)
మహాలయ పక్షంలో ఐదో రోజు (పంచమి) బుధవారం. బుధవారం పూట పితృదేవతలకు శ్రాద్ధం ఇచ్చి.. చేతనైనంత దానం చేయడం మంచిది. అలాగే పితృదేవతలు నాగ రూపంలో కనిపిస్తారని విశ్వాసం. అంతేకాదు.. నాగదేవతలు పితృదేవతలకు ప్రతిరూపాలు. అందువల్ల నాగదేవతా పూజ, సర్ప ఆరాధన చేసి నాగదేవతలను, పితృదేవతలను ప్రార్థించాలి. 
 
తల్లిదండ్రులు సమస్త పితృదేవతలకు ప్రతిబింబాలు. పితృదేవతల అనుగ్రహం తల్లిదండ్రుల ద్వారానే వర్షిస్తుంది. అందువల్ల వారిని గౌరవించాలి. తల్లిదండ్రులను గౌరవిస్తే.. జాతక దోషాలు తొలగిపోతాయి. 
 
ప్రతి ఏటా పితృదేవతలకు శ్రాద్ధకర్మ చేయాలి. ఆదివారం పూట నాగదేవతలకు పూజ తప్పనిసరి. అలా పూజించే రోజున శాకాహారం తీసుకోవాలి. బ్రహ్మచర్యం పాటించాలి. స్త్రీలను గౌరవించాలి. ఇంటి ఆడపడుచులను గౌరవించి.. పసుపుకుంకుమలు ఇవ్వాలి. గోవుకు పూజ చేయాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు