శుక్రవారం పూట వర్జ్యం సమయంలో మౌనవ్రతం వుంటే?

గురువారం, 10 నవంబరు 2022 (14:39 IST)
శుక్రవారం పూట శ్రీ మహాలక్ష్మి దేవిని ఉపాసన చేస్తే ధన సమృద్ధి కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు వుండవు. సంపదలతో తులతూగాలనుకునేవారు లక్ష్మీదేవిని పూజించాలి. ఉప్పును, పసుపును కొనుక్కోవాలి. 
 
శుక్రవారం పూట సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. పాలను అధికంగా వుపయోగించాలి. శుక్రవారం పూట లేదా రోజూ కొద్దిపాటి అన్నాన్ని శేషంగా ఓ చిన్నపాటి గిన్నెలో వుంచి వంటింట్లో వుంచడం సంప్రదాయం. ఇలా చేస్తే పితరులు దేవతులు ఆ ఇంట అన్నం ఎల్లప్పుడు వుండుగాక అని దీవిస్తారని ప్రతీతి. 
 
శుక్రవారం నుదుట బొట్టు ధరించేవారికి కలకాలం సౌభాగ్యం నిలిచి వుంటుంది. ఇంకా స్టిక్కర్లను నుదుట ధరించకుండా తెల్ల వక్కలతో తయారైన కుంకుమను శుక్రవారం ధరిస్తే మహాలక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. 
 
శుక్రవారం పూట తెల్లని వస్త్రాలను ధరించడం ఓ నియమం. తెల్లని వస్త్రాలంటే శుక్రునికి, మహాలక్ష్మీకి ప్రీతికరం. తెల్లని దుస్తులను శుక్రవారం ధరిస్తే మహాలక్ష్మీ దేవి అనుగ్రహం లభిస్తుంది. 
 
అలాగే శుక్రవారం కమలములతో, కలువలతో లక్ష్మీదేనిని అర్చించినట్లైతే అనుకున్న కోరికలు నెరవేరుతాయి. శుక్రవారం వర్జ్యం వున్న సమయంలో మౌనవ్రతం పాటించినా ఆ ఇంట తప్పకుండా ధన సమృద్ధి కలుగుతుందని పండితులు సూచిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు