Skanda Shasti 2022: ఉపవాసం, పూజా పద్ధతి.. దేవతలకు సైన్యాధిపతిని స్తుతిస్తే?

ఆదివారం, 30 అక్టోబరు 2022 (00:05 IST)
స్కంద షష్ఠి పవిత్రమైన రోజు. ఇది కుమార స్వామి ఆరాధనకు అంకితం చేయబడింది. భక్తులు ఈ రోజున ఉపవాసం పాటించి కుమార స్వామి అనుగ్రహం పొందుతారు. సంతోషకరమైన, సంపన్నమైన జీవితం కోసం స్కంధ షష్ఠి వ్రతం ఆచరిస్తారు. క్యాలెండర్ నెలలో కృష్ణ పక్షంలోని ఆరవ రోజున షష్ఠి పాటిస్తారు.
 
స్కంద షష్ఠి అక్టోబర్ 2022 తేదీ: అక్టోబర్ 30, ఆదివారం వస్తోంది
తిథి సమయం: అక్టోబర్ 30, 5:50 am - అక్టోబర్ 31, 3:28 am.
షష్ఠి ఆచారాలు: ఉపవాసం, ప్రార్థన.
 
ఈ ఉపవాసం సూర్యోదయం సమయంలో ప్రారంభమవుతుంది. మరుసటి రోజు సూర్య భగవానుడికి ప్రార్థనలు చేసిన తర్వాత ముగుస్తుంది. వైకుంఠ ఏకాదశి తరహాలో షష్ఠి వ్రతం ఆచరిస్తారు. ఈ ఉపవాసం పాక్షికంగా తీసుకోవచ్చు. పండ్లు తినడం, పాలు తీసుకోవడం ద్వారా పాక్షిక ఉపవాసం చేయవచ్చు.
 
ఆరోగ్య సమస్యలు ఉన్నవారు పగటిపూట ఒకే భోజనంతో ఉపవాసం పాటించవచ్చు. మాంసాహారం తినడం, మద్యం సేవించడం ఈ ఉపవాసానికి విరుద్ధం. ఈ రోజున భక్తులు 'స్కంద పురాణం' చదివి 'స్కంద షష్టి కవచం' పఠిస్తారు. అలాగే కుమార స్వామి ఆలయాన్ని సందర్శించడం చేస్తారు. దేవతలకు సైన్యాధిపతి అయిన కుమారస్వామి.. రాక్షసుడైన తారకాసురుడు, సూరపద్మను వధించినట్లు చెప్తారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు