శరత్ పూర్ణిమ తిథి ప్రకారం, అక్టోబర్ 17వ తేదీన పౌర్ణమిని జరుపుకుంటారు. కానీ 16 అక్టోబర్ 2024 బుధవారం నాడు రాత్రి 8:40కి పూర్ణిమ తిథి ప్రారంభమవుతుంది. ఆ మరుసటి రోజు అంటే 17 అక్టోబర్ 2024 పూర్ణిమ తిథి 4:55కి ముగుస్తుంది.
ఈ రోజున చంద్రోదయ సమయంలో చంద్రుడికి నీటిని సమర్పించాలి. ఏదైనా ఆలయానికి వెళ్లి నేతి దీపం వెలిగించడం ద్వారా సర్వశుభాలు చేకూరుతాయి. ముఖ్యంగా పెరుమాళ్ల ఆలయంలో జరిగే గరుడ సేవలో పాల్గొనడం విశేష ఫలితాలను ఇస్తుంది.
ఇంకా లక్ష్మీదేవి, శ్రీ విష్ణుమూర్తికి పూర్తి భక్తి శ్రద్ధలతో పూజలు చేయడం ద్వారా ఈతిబాధలు తొలగిపోతాయి. అలాగే పంచభూత స్థలాల్లో ఒకటైన అరుణాచలేశ్వరం వెళ్లవచ్చు.
ఈ రోజున అరుణాచల శివుడిని దర్శించుకోవడం ద్వారా సర్వశుభాలు, మోక్షం సిద్ధిస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.