కార్తీక మాసంలో దీపం పెట్టడం ఆయువును ప్రసాదిస్తుంది. జ్ఞానేంద్రియాలపై సమస్త సుఖములు ఆధారపడి వుంటాయి. ఈ జ్ఞానేంద్రియాలకు పరమాత్ముడు శక్తిని ఇచ్చాడు. ఆత్మకాంతి కంటిమీద పడే శక్తినిస్తుంది. కంటిని ఇచ్చి వెలుతురును చూసే సుఖాన్ని తనకిచ్చిన ఈశ్వరునికి కృతజ్ఞతలు తెలుపుతూ.. అందుకు ప్రతీకగా దీపాన్ని పెడుతున్నానని భావించాలని పండితులు చెప్తున్నారు. ఇలా పంచేంద్రియాలతో సుఖాలను పొందగలిగే శక్తినిచ్చిన ఈశ్వరునికి కృతజ్ఞతలు తెలుపుతూ.. కార్తీక మాసంలో దీపం వెలిగిస్తారు.
కార్తీక దీపాన్ని నువ్వుల నూనెతో వెలిగిస్తారు. నువ్వుల నూనెలో వెలుగుతున్న దీపపు వత్తి నుంచి వచ్చే పొగ వాసన చూస్తే హృదయ నాడి బలిష్టమవుతుంది. ఇలా జరగడం ఆయుర్‌కారకమని.. తద్వారా హృదయ నాడి నిలబడుతుందని పండితులు చెప్తున్నారు. అందుకే కార్తీక మాసంలో ఉదయం, సాయంకాలం దీపం పెట్టాలని వారు సూచిస్తున్నారు.