మహా శివరాత్రి రోజున ప్రమిదలతో దీపం వెలిగిస్తే..?

గురువారం, 11 మార్చి 2021 (12:18 IST)
మహా శివరాత్రి రోజున ప్రమిదలతో దీపం వెలిగించడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. అదే ప్రమిదలను ఏ దిశలో వెలిగిస్తే ఎలాంటి ఫలితం దక్కుతుందో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే. తూర్పు దిశలో ప్రమిదలను శివరాత్రి పూట వెలిగించడం ద్వారా ఈతిబాధలు తొలగిపోతాయి. సమాజంలో గౌరవ ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. 
 
పడమర:  పడమటి దిక్కున ప్రమిదలతో దీపాన్ని వెలిగించడం ద్వారా కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం, ఆప్యాయతలు పెరుగుతాయి. అప్పుల బాధలు తొలగిపోతాయి. ఉత్తరం వైపు మహాశివరాత్రి రోజున దీపం వెలిగిస్తే.. సర్వమంగళం చేకూరుతుంది. సిరిసంపదలు వెల్లివిరుస్తాయి. సుఖసంతోషాలు చేకూరుతాయి. 
 
దక్షిణం వైపు ప్రమిదలతో కూడిన దీపాన్ని వెలిగిస్తే.. అనూహ్య సమస్యలు, అప్పుల బాధలు, ప్రతికూలతలు తప్పవని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. అలాగే ప్రమిదలలో దీపం వెలిగించేటప్పుడు దూది వత్తులను ఉపయోగించడం ద్వారా శుభం చేకూరుతుంది. 
 
తామర కాడలతో చేసిన వత్తుల ద్వారా దీపాన్ని వెలిగించడం చేస్తే.. పూర్వ జన్మల పాపాలు తొలగి.. సంపదలు చేకూరుతాయి. అరటి కాడలతో తయారైన వత్తులను ఉపయోగిస్తే.. సంతాన ప్రాప్తి చేకూరుతుంది. తెల్ల జిల్లేడు వత్తులను వుపయోగిస్తే.. ప్రతికూలతలు తొలగి.. ఆయుర్దాయం పెరుగుతుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు