సూర్యగ్రహణం సమయంలో సూర్యుడు కనిపించరు. రాహువు అనే రాక్షసుడు సూర్యుడిని మింగేయడంవల్ల గ్రహణం ఏర్పడుతుందని చాలా మంది నమ్ముతారు. హణ సమయంలో భగవంతుణ్ణి స్మరించుకుంటే మంచిది. గ్రహణం పూర్తీ అయ్యాక విడుపు స్నానము చేస్తారు. గ్రహణం ఏర్పడిన రాశి, నక్షత్రం గలవారు జపాలు, దానాలు చేయించుకుంటే మంచిది.
గర్భిణీలపై గ్రహణం ప్రభావం చూపుతుందని బలంగా నమ్ముతారు. గ్రహణ సమయంలో గర్భిణీ మహిళలు బయటకు రాకూడదు. అలాగే గ్రహణం పట్టడానికి మూడు గంటలకు ముందే ఆహారాన్ని తీసుకోవాలి. గ్రహణ సమయంలో అసలు ఆహారాన్ని తీసుకోకూడదు. గర్భవతులు తమ తలకింద దర్బలను పెట్టుకుని పడుకుంటే పుట్టబోయే బిడ్డ ప్రహ్లాదుడి అంతటి వాడు అవుతాడని పెద్దలు అంటూ వుంటారు.
గ్రహణాన్ని చూడరాదని, చూడటం వల్ల పుట్టే పిల్లలు అనారోగ్యంతో ఉంటారని చెబుతారు. అందుకే గ్రహణం సమయంలో ఎవరైనా ఆహారాన్ని తీసుకోవడం చేయకూడదని.. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు గ్రహణం సమయంలో తలకింద దర్బలను వుంచుకుని నిద్రపోవడం మంచిదని ఆధ్యాత్మిక నిపుణులు చెప్తున్నారు.